శ్రీలంక ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి

తులసీరామ్ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు. ఇటీవలే అతడు శ్రీలంక పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది.

news18-telugu
Updated: April 23, 2019, 10:04 PM IST
శ్రీలంక ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి
శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 10:04 PM IST
శ్రీలంకలో పేలుళ్లు హైదరాబాద్‌లోనూ విషాదం నింపాయి. కొలంబోలో జరిగిన వరుస పేలుళ్లలో హైదరాబాద్ వాసి చనిపోయాడు. అమీర్‌పేట్‌కు చెందిన 31 ఏళ్ల తులసీరామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తులసీరామ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు గ్రామం. తులసీరాం మృతితో సొంతూరు రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. కుమారుడు మరణవార్త తెలుసుకున్న తులసీరాం కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

తులసీరామ్ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు. ఇటీవలే అతడు శ్రీలంక పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో అక్కడ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లలకు పాల్పడడంతో 321 మంది చనిపోయారు. వారిలో తులసీరాం కూడా ఉన్నాడు.

ఈస్టర్ రోజు కొలంబోతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది చనిపోయారు. వందలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల వెనుక ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఇప్పటి వరకు ఆధారాలు లభించగా, వరుస పేలుళ్లకు పాల్పడింది తామేనని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రకటన చేసింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...