చంద్రబాబుకి షాక్... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ

Chandrababu : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై 2005లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్టే గడువు ముగిసిపోవడంతో... మళ్లీ ఆ కేసు విచారణ తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: November 19, 2019, 8:54 AM IST
చంద్రబాబుకి షాక్... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ
చంద్రబాబు, లక్ష్మీపార్వతి
  • Share this:
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి... హైదరాబాద్ ACB కోర్టు షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల కిందట లక్ష్మీపార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే గడువు ముగియడంతో... ఆ కేసు దర్యాప్తు కొనసాగించేందుకు ACB కోర్టు ఒప్పుకుంది. అందువల్ల అప్పట్లో కేసు పెట్టిన లక్ష్మీపార్వతి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించినట్లైంది. ఈ నెల 25కి విచారణను వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం చూస్తే... చంద్రబాబు కేసులో స్టే గడువు ముగిసినా... దాన్ని పొడిగించాల్సిందిగా చంద్రబాబు కోరలేదు. నెక్ట్స్ ఉత్తర్వులు వచ్చే వరకూ... 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. ఈ వాదనను తప్పుపడుతూ... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు లక్ష్మీపార్వతి తరపు లాయర్ సురేందర్‌రెడ్డి. ఈ పరిస్థితుల్లో 2005 మార్చి 14న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రస్తుత జడ్జి పరిశీలించారు. స్టే గడువు ముగిసినందున... చంద్రబాబు తరపు లాయర్... ఇప్పుడు వాదనలు వినిపించేందుకు వీలు లేదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్ని లెక్క లోకి తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు కేసు విచారణ కొనసాగనుంది.

ఇదీ కేసు : చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ... ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని... దీనిపై ACB దర్యాప్తు చెయ్యాలని లక్ష్మీపార్వతి 2005లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ స్వీకరించకముందే.... చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ వేసి... తమ వాదన వినాలని కోరారు. కంప్లైంట్‌ తీసుకోకుండానే వాదనలు వినడం కుదరదంటూ ఏసీబీ కోర్టు చంద్రబాబు పిటిషన్‌ను కొట్టివేసింది. వెంటనే ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. దాన్ని స్వీకరించిన అప్పటి జడ్జి DSR వర్మ... ACB కోర్టులో కేసు విచారణపై స్టే విధించారు. ఈ స్టేని ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి పిటిషన్ వేయగా... దాన్ని హైకోర్టు కొట్టివేసింది. అందువల్ల 2005 నుంచీ స్టే కొనసాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల... స్టే ఆటోమేటిక్‌గా ముగిసిపోయినట్లైంది. ఇప్పుడు ఈ నెల 25న ACB కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

Pics : తెలుగు అందం శృతి రెడ్డి క్యూట్ ఫొటోస్
 

ఇవి కూడా చదవండి :లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్

రోజూ 9 గంటలు పని? ఉద్యోగులకు షాక్?

ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించే ఛాన్స్...

ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?

బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?
Published by: Krishna Kumar N
First published: November 19, 2019, 8:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading