వాళ్లిద్దరికీ పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. ఉపాధి కోసం భార్య వేరే దేశం వెళ్లగా.. భర్త పిల్లలు ఇక్కడే ఉంటున్నారు. కానీ ఓ రోజు భర్తకు.. భార్యకు సంబంధించిన ఓ వీడియో వచ్చింది. ఆ తర్వాత అనుకోని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) సీతానగరం మండలం గోకవరంకు చెందిన వ్యక్తికి వంగలపూడికి చెందిన మహిళతో పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. ఉపాధి కోసం భార్య కువైట్ (Kuwait) వెళ్లింది. భర్త స్వగ్రామంలో ఉంటూ ఆటో నడుపుతుండగా.. పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి (Sankranti) కి వంగలపూడి వెళ్లిన తండ్రి.., బయటికెళ్దాం రమ్మంటూ ముగ్గుర్ని సమీపంలోని తోటల్లోకి తీసుకెళ్లాడు.
అప్పటికే తనతో ఎలుకల మందు తీసుకొచ్చిన తండ్రి వారితో ఎలుకల మందు తాగించేందుకు యత్నించాడు. చిన్నకుమారుడితో పాటు తండ్రి ఎలులక మందు తాగేయగా.. మిగిలిన ఇద్దరు మాత్రం అందుకు నిరాకరించారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తండ్రికొడుకులిద్దర్ని ఆస్పత్రికి తరలించారు.
ఆ వీడియోలే కారణమా..?
తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకరణ వీడియోలను భర్త చూడటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమీప బంధువుల్లో ఒకరు ఆ వీడియోలను భర్తకు పంపినట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భార్య అలా చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడా..? లేక మరేదైనా కారణముందా అని పోలీసులు విచారిస్తున్నారు. ఐతే సదరు వ్యక్తిపై గతంలో చోరీ కేసులున్నాయని తెలుస్తోంది. పిల్లలు కూడా తండ్రి తమను పట్టించుకోవడం లేదని చెప్పడం గమనార్హం.
కర్నూలు జిల్లాలో భర్తపై దాడి
కర్నూలు జిల్లాలో దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నద్యాలకు చెందిన ఈశ్వర్ రెడ్డి పలు వ్యాపారాలు చేసి నష్టపోయాడు. అప్పుల వాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రాంతంలో ఉంటూ అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వచ్చి వెళ్తునాడు. ఈ క్రమంలో భార్య శివపార్వతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓ రోజు రాత్రి ఈశ్వర్ రెడ్డి ఇంటికొచ్చిన సమయంలో ప్రియుడితో కలిసి భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో భార్య, ప్రియుడు, అతని స్నేహితులు కలిసి ఈశ్వర్ రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. స్థానికులు రావడంతో వారి నుంచి తప్పించుకున్న ఈశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.