Andhra Pradesh: భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆ భర్త ఏం చేశాడో తెలుసా...?

భార్య మాణిక్యాంబ విగ్రహంతో వీరభద్రం

Andhra Pradesh: రిటైర్డ్ ఐర్ఎస్ఐ బుర్రా వీరభద్రం, మాణిక్యాంబ దంపతులు, వీరికి ఇద్దరు కుమార్తుల, ఓ కుమారుడు న్నారు.

 • Share this:
  తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు. అంతేకాదు, వేదమంత్రాల సాక్షిగా ఆమె విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణ రావు కాలనీలో కి చెందిన రిటైర్డ్ ఐర్ఎస్ఐ బుర్రా వీరభద్రం, మాణిక్యాంబ దంపతులు, వీరికి ఇద్దరు కుమార్తుల, ఓ కుమారుడు న్నారు. ఐతే ఏడాదిన్నర క్రితం వీరభద్రం భార్య మాణిక్యాంబ అనారోగ్యంతో మృతి చెందారు. భార్య హఠాన్మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన వీరభద్రం,, ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేకపోయాడు.

  ఎప్పుడూ భార్య తనతోనే ఉండాలని భావించి ఆమె నిలువెత్తు విగ్రహం చేయించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని నవర గ్రామానికి చెందిన శిల్పి సత్యలింగంను సంప్రదించి అతని భార్య ప్రతిమను టేకు చెక్కతో తయారు చేయించాడు. మూడు నెలల శ్రమ ఫలితంగా మాణిక్యమ్మ ప్రతిబింబం తయారైంది. వేద పండితుల నడుమ, పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. వీరభద్రంకు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన స్థానికులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భార్య జ్ఞాపకాలను విడిచి ఉండలేక విగ్రహాన్ని తయారు చేయించినట్లు వీరభద్రం తెలిపారు.

  ఇది చదవండి: “పిచ్చికుక్క కోసం మున్సిపాలిటీ వ్యాన్ వస్తోంది...” వైసీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్  కాగా గతేడాది ఆగష్టులో కర్ణాటకలో  ఇలాంటి ఘటనే జరిగింది. కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రిందట ఓ రోడ్డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  భార్య కాలం చేసిన కొన్నాళ్లకు శ్రీనివాస్ గుప్తా కొత్తింటికి గృహప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యక్రమానికి తన భార్య లేని లోటు తెలియకుండా ఉండాలని అనుకున్నాడు. మనసుంటే.. మార్గం ఉంటుంది. అతనికి మదిలో ఓ ఆలోచన తట్టింది. అచ్చం తన భార్యలా ఉండే నిలువెత్తు మైనపు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించాడు. ఇంకేముంది కుటుంబసభ్యులు అందరూ కూడా దాన్ని చూసి మురిసిపోయారు. ఆ మైనపు విగ్రహంతో ఫోటోలు దిగి సంతోషించారు. జీవకళ ఉట్టిపడేలా ఉన్న మైనపు విగ్రహం  సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  ఇది చదవండి: ఎన్టీఆర్ రావాల్సిందే.. కుప్పంలో చంద్రబాబుకు కార్యకర్తల షాక్  కట్నం కోసమే, వివాహేతర సంబంధాల కోసమో, ఇతర కారణాలతోనే భార్యలను బలితీసుకుంటున్న ఘటనలు  ఇటీవల చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి.  భార్య లేని ఎడబాటును భరించలేక  వారి నిలువెత్తు రూపాలను గుండెల్లోనే కాదు ఇళ్లలోనూ ప్రతిష్టించుకుంటున్న ఇలాంటి భర్తలు ఉండటం నిజంగానే గ్రేట్.

  ఇది చదవండి: ఆ నేత విషయంలో సీఎం జగన్ మాట తప్పారా..? ఆమె వల్లే పదవి రావడం లేదా..?


  Published by:Purna Chandra
  First published: