HUSBAND KILLED WIFE AS HE DOUBTED THAT SHE HAS EXTRAMARITAL AFFAIR IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Husband: అనుమానం మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది.., కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా..!
ప్రతీకాత్మకచిత్రం
Chittoor: అతడికి భార్యపై ఉన్న అతి ప్రేమ అనుమానంగా మారింది. చిన్నపాటి విషయాలకే ఇద్దరూ గొడవపటటం మొదలుపెట్టాడు. అనుమానం పెనుభూతంగా మారడంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు.
కళ్యాణం వైభోగం ఆనందం అంటారు పెద్దలు. పెళ్ళై సుఖసంతోషాలతో చిలకాగోరింకల్లా కలకలం కలసి జీవించాలని జంటను ఓ గూటికి చేరుస్తారు కన్నవాళ్ళు. నూరేళ్ళ పంటగా సాగాల్సిన సంసారం సాగరాన్ని నిప్పుల కొలిమిలా మార్చుకుంటున్నారు భార్యాభర్తలు. చిన్న విషయాలలో మొదలైన చిచ్చు... చినికిచినికి గాలివానలా మారుతోంది. అలా పెరిగే వివాదం హత్యా చేసేంత స్థాయికి దారి తీస్తుంది. అనుమానం అనే భూతం మనిషి జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్యపై అనుమానంతో ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొందరు భర్తలు. భార్యను అణువణువునా అనుమానిస్తూ.... ఆమెను చిత్ర హింసలు పెడుతూవచ్చాడు ఓ భర్త. తన భార్య వేరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుందన్న అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి హత్యకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పుత్తూరుకు చెందిన చంద్రశేఖర్, వనజ దంపతులకు 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు తిమ్మాపురంలోనే నివాసం ఉంటున్నారు. భార్య వనజ అంటే చంద్రశేఖర్ కు ఎంతో ఇష్టం ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు మొదలయ్యాయి. తరచూ గొడవడటం పిల్లల ఎడవటంతో మళ్లీ కలిసిపోవడం వంటివి చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగానీ.. చంద్రశేఖర్ కు భార్యపై అనుమానం రేగింది. భార్య వేరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుందని అనుమానించేవాడు. అదే విషయంపై కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈసారి భార్యపై మరింత ఆగ్రహంతో రగిలిపోయిన చంద్రశేఖర్.. భార్యను కత్తితో పొడిచి హత్యచేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘనాస్థలికి చేరుకున్న పోలీసులు వనజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ ను పుత్తూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
క్షణికావేశంలో చేసిన తప్పు ఇద్దరు చిన్నారుల జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసింది. నిత్యం తల్లిదండ్రుల ధ్యాసలో ఉండే చిన్నారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోనే ఇలాంటి ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో రగిలిన పోయిన ఓ టైలర్ ఆమెపై హత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కలవాళ్లు గమనించి ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తలక ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఇలాంటి ఘటనల జరగవని పోలీసులు చెబుతున్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం వల్ల పిల్లల భవిష్యత్తు అంథకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.