భార్య సూసైడ్ లేఖలో ఓ వ్యక్తి పేరు.. బంధువులతో సహా వెళ్లి అతడి ఇంటిని తగలబెట్టిన భర్త.. చివరకు సీన్ రివర్స్..!

ప్రతీకాత్మక చిత్రం

’నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు ధనశేఖర్ అనే కానిస్టేబులే కారణం. అతడు నన్ను వేధిస్తున్నాడు. చిత్రహింసలు పెడుతున్నాడు. నా సంసారాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.‘ అంటూ ఓ వివాహిత సూసైడ్ లేఖ రాసి చనిపోయింది. చివరకు..

 • Share this:
  ’నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు ధనశేఖర్ అనే కానిస్టేబులే కారణం. అతడు నన్ను వేధిస్తున్నాడు. చిత్రహింసలు పెడుతున్నాడు. నా సంసారాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ బాధలు భరించలేను. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.‘ అంటూ ఓ వివాహిత సూసైడ్ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఆ లేఖను చూసిన భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బంధువులతో సహా ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లాడు. అతడి ఇంటిపై దాడి చేశాడు. ఇంటికి నిప్పంటించాడు. వివాహిత ఆత్మహత్య, కానిస్టేబుల్ ఇంటిపై దాడి ఘటనల్లో కేసులు నమోదు చేసిన పోలీసులకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. ఆ భార్యది ఆత్మహత్య కాదు, హత్యేనని స్పష్టమయింది. ఎవరు చేశారో కూడా తేల్చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  చిత్తూరు జిల్లా నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగకు చెందిన నారాయణమూర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది కులాంతర వివాహం కూడా. ఈ దంపతులకు 6ఏళ్ల మహీధర్, 4ఏళ్ల బాబి అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భానుప్రియను స్థానికంగా ఉంటున్న ఉపాధ్యాయుడు గోపీ, ఎపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు వేధిస్తుండేవారు. అయితే తన భార్య ప్రవర్తన చెడుగా ఉండటం వల్లే వాళ్లు వేధిస్తున్నారని భర్త అనుమానం పెంచుకున్నాడు. భార్యను తరచు ఇబ్బందులు పెట్టేవాడు.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  భర్త వేధింపులపై మూడ్రోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నారాయణమూర్తి ఆగ్రహం పెంచుకున్నాడు. భార్యను బెదిరించాడు. బలవంతంగా ఆమెతో సూసైడ్ లేఖ రాయించాడు. ఆ తర్వాత ఆమెకు ఉరి వేసి చంపేశాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు నారాయణమూర్తి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తన బంధువులతో కలిసి ధనశేఖర్ ఇంటిపై దాడి చేశాడు. పోలీసుల విచారణలో నారాయణమూర్తే అసలు దోషి అని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో భానుప్రియను వేధించిన గోపీ, ధనశేఖర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన కేసులోనే కాకుండా ధనశేఖర్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో కూడా నారాయణమూర్తిపై మరో కేసు నమోదయింది.
  ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!
  Published by:Hasaan Kandula
  First published: