Home /News /andhra-pradesh /

HUSBAND COMMITS SUICIDE AFTER WIFE HAVING EXTRAMARITAL AFFAIR IN WEST GODAVARI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: భార్యను ఏ భర్త చూడకూడని స్థితిలో చూశాడు.. తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు.. రియల్లీ షాకింగ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Eluru Woman: ఈ రోజుల్లో అగ్నిసాక్షిగా ఒకటైన వివాహ బంధాలకంటే.. క్షణిక సుఖాల కోసం కలిసే వివాహేతర సంబంధాలకే కొందరు ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాంటి బంధాలు గుట్టుగా ఉన్నంతకాలం బాగానే ఉంటాయి. కానీ కట్టుకున్నవాళ్లకి తెలిస్తే మాత్రం జీవితాలు అల్లకల్లోలమవుతాయి.

ఇంకా చదవండి ...
    ఈ రోజుల్లో అగ్నిసాక్షిగా ఒకటైన వివాహ బంధాలకంటే.. క్షణిక సుఖాల కోసం కలిసే వివాహేతర సంబంధాలకే కొందరు ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాంటి బంధాలు గుట్టుగా ఉన్నంతకాలం బాగానే ఉంటాయి. కానీ కట్టుకున్నవాళ్లకి తెలిస్తే మాత్రం జీవితాలు అల్లకల్లోలమవుతాయి. అలా పెళ్లై చక్కగా చూసుకునే భర్త ఉండగానే భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య నడిపిస్తున్న వ్యవహారం గురించి తెలుసుకున్న భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) ఏలూరు నగరంలోని చాణక్యపురి ప్రాంతానికి చెందిన పెరుమాళ్ల సంతోష్ కు రామకుమారితో కొంతకాలం క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంతోష్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

    ఐతే రామకుమారికి రూప గోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త లేని సమయంలో ఆమె గోవింద్ ను కలుస్తుండేది. ఐతే ఓ రోజు భార్య వ్యవహారం సంతోష్ కు తెలిసింది. అయినా భరించిన అతడు.. పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. అయినా తీరు మారని రామకుమారి.. భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడితో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో మార్చి 29న భార్య, ప్రియుడితో ఏకాంతంగా ఉండటాన్ని కళ్లారా చూశాడు.

    ఇది చదవండి: ఈ దొంగ స్టైలే వేరు.. కలలో కనిపించిన ఇళ్లలోనే దొంగతనం..


    ఏ భర్త చూడకూడని సీన్ చూసేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన మరణానికి భార్య రామకుమారి, ఆమె ప్రియుడు గోవింద్ కారణమని తల్లిదండ్రులతో చెప్పి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంతోష్ ఆత్మహచ్యకు కారణమైన రామకుమారి, ఆమె ప్రియుడు గోవింద్ ను అరెస్ట్ చేశారు. తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో వారి పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.

    ఇది చదవండి: రాత్రి పొలంలోనే పడుకున్నాడు.. ఉదయాన్నే మంచంపై షాకింగ్ దృశ్యం.. ఆ రాత్రి ఏం జరిగింది..?



    ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇలాంటి ఘటనే జరింది. ఇస్సపాలెం ప్రాంతానికి చెందిన అబంటిపూడి సాయిచరణ్, కోమిలికి కొంతకాలం క్రితం పెళ్లైంది. ఐతే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భర్త తన స్వగ్రామమైన కర్నూలులో ఉంటున్నాడు. ఐతే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉమామహేశ్వరి అనే మహిళ సాయి చరణ్ కు కబరు పెట్టింది. దీంతో అతడు కుటుంబంతో కలిసి నరసరావుపేట వచ్చాడు. ఐతే భర్తకు కోమలి మాజా కూల్ డ్రింక్ ఇచ్చింది. డ్రింక్ తాగిన కాసేపటికే అతడు సాయి చరణ్ కుప్పకూలిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐతే కూల్ డ్రింక్ లో విషం కలపడంతోనే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పడంతో సాయి చరణ్ షాక్ తిన్నాడు. భార్య కోమలితో పాటు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు