Home /News /andhra-pradesh /

HUSBAND COMMIT SUICIDE AFTER WIFE PUT FAKE CASES ON HIM WITH HER PARENTS INFLUENCE IN PRAKASAM DISTRICT HSN

అతడు గ్రామ వలంటీర్.. ఆమె మహిళా పోలీస్.. పోలీస్ స్టేషన్లో ప్రేమ పెళ్లి.. ఐదు నెలలకే ఇంత ఘోరమా..!

మృతుడు నాగేంద్రబాబు (ఫైల్ ఫొటో)

మృతుడు నాగేంద్రబాబు (ఫైల్ ఫొటో)

అతడో గ్రామ వలంటీర్, ఆమె మహిళా పోలీస్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అమ్మాయి తరపు వాళ్లు ఒప్పుకోకున్నా, పెద్దలను ఎదురించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ ఐదు నెలల్లోనే సీన్ రివర్స్ అయింది.

    అతడు గ్రామ వలంటీర్. ఆమె అదే గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా పనిచేస్తోంది. ఇద్దరికీ మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొద్ది రోజుల్లోనే ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చింది. ఇళ్లల్లో చెబితే ఒప్పుకోరనుకున్నారో, ఇంట్లో వాళ్లు నిజంగానే ఒప్పుకోలేదేమో కానీ, వారిద్దరూ పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నారు. కానీ ఐదు నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. ప్రేమించి, పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్న ఆమె, తన భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అక్రమ కేసులను ఆ భర్త తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్నేహితులకు తన బాధనుచెప్పుకుని వాపోయాడు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నాగేంద్రబాబు అనే 25 ఏళ్ల యువకుడు గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ యువతి మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసి, పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఐదు నెలల క్రితం చీరాల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే ఐదు నెలలుగా వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి, పండుగకు తీసుకెళ్తామని చెప్పి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి నాగేంద్రబాబుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి కేసు పెట్టింది. మా అమ్మాయిని బెదిరించి, భయపెట్టి వివాహం చేసుకున్నాడనీ, ఇప్పుడు వేధిస్తున్నాడనీ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో తనపై భార్యే అక్రమ కేసులు పెట్టడంతో నాగేంద్రబాబు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న నాగేంద్ర బాబు మృతదేహాన్ని కిందకు దించారు. పోలీసులకు సమచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్‌ సిఐ బి.పాపారావు తెలిపారు.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Love affair

    తదుపరి వార్తలు