Home /News /andhra-pradesh /

HUSBAND CAUGHT RED HANDED WITH HIS LOVER AND HELP HER MOTHER IN CHITOOR DISTRICT NGS

Extramarital affair: పెళ్లాం ఊరెళితే.. ప్రియురాలితో సరసాలు.. ట్విస్ట్ ఏంటంటే? అమ్మే పట్టించింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extra marital affair: భార్య (WIFE ) కళ్లుగప్పి మరో వివాహితతో (Married women) సంబంధం (Extra marital affair) పెట్టుకున్న భర్త. పెళ్లాం ఊరెళ్లే సరికి.. ప్రియురాలిని (lover ) నేరుగా ఇంటికే తీసుకొచ్చాడు. కట్ చేస్తే.. భార్య చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అదికూడా కన్నతల్లి (mother) దగ్గరుండి మరీ కొడుకు బండారాన్ని బయట పెట్టింది.

ఇంకా చదవండి ...
  Extramarital affair: పచ్చని సంసరాలు కుప్పకూలుతున్నాయి.. నిండు నూరేళ్ల బంధం.. మూడేళ్ల ముచ్చటే అవుతోంది.. చేతిలో చేయి వేసి ఏడు అడుగులు నడిచిన భార్య భర్తల బంధం.. ఏడేళ్లు కూడా సాఫీగా సాగడం లేదు.. కోరికలను అదుపు చేసుకోలేకపోవడం.. పరాయి మోజు పెరగడం లాంటి కారణాలే ఎక్కువ కాపురాలు కూలిపోవడానికి కారణం అవుతున్నాయి. వివాహ వ్యవస్థపై సన్నగిల్లుతున్న నమ్మకమో... అడల్ట్రీ నేరం కాదనే ధైర్యమో గానీ వివాహేతర సంబంధాలు (Extramarital affairs) .. వాటి వల్ల జరిగే నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. భారతీయ వైవాహిక వ్యవస్థకు అత్యంత మూలమైన నమ్మకం అనే ప్రమాణాన్ని గాలికొదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు కొందరు స్త్రీ, పురుషులు. కట్టుకున్న వారి కళ్లుగప్పి చాటుమాటుగా వ్యవహారం సాగిస్తున్నావారు కొందరైతే... అడ్డుతగులుతున్నారని అయినవారిని కడతేర్చడానికి సైతం సిద్ధం పడిపోతున్నవారు మరికొందరు. ఇంటి నుంచి బయటకెళ్లిన భర్త ఎప్పుడు తిరిగొస్తారని ఎదురుచూసే రోజులు కాస్తా.... భర్త ఎక్కడ ఏ పరిస్థితిలో చిక్కుతాడా అని వెతుకులాడే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి స్థితిలోనే ఓ ప్రభుద్ధుడికి కట్టుకున్న పెళ్లామే బడితపూజ చేసింది (Wife slapping Husband)... అది కూడా కన్నతల్లి దగ్గరుడి మరీ కొడుకు బండారాన్ని కొడలికి చూపించింది.

  భార్య కళ్లుగప్పి మరో వివాహితతో సంబంధం పెట్టుకున్న భర్త... పెళ్లాం ఊరెళ్లే సరికి... ప్రియురాలి (Lover) ని నేరుగా ఇంటికే తీసుకొచ్చాడు. కట్ చేస్తే.. భార్య (Wife) చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అదికూడా కన్నతల్లి దగ్గరుండి మరీ కొడుకు బండారాన్ని బట్టబయలు చేసింది. కోనసీమ జిల్లా (Konaseema District) కె.గంగవరం మండలం (K Gangavaram Mandal) పేకేరు శివారు నల్లచెరువుపుంత గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాస్ (Rayudu Srinivas),  వీరలక్ష్మి (Veera Laxmi) భార్యాభర్తలు (Wife and Husband). వీరికి పదేళ్ల క్రితం వివాహం కాగా.... శ్రీనివాస్ డ్రైవర్ (Driver Srinivas) గా పనిచేస్తున్నాడు. తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లే శ్రీనివాస్ కు హైదారబాద్ (Hyderabad) లో నివాసం ఉంటున్న బెల్లం లక్ష్మీ అనే వివాహితతో పరిచేయం ఏర్పడింది.

  ఇదీ చదవండి: చంద్రబాబు దేశాన్ని నాశనం చేశారు.. పవన్ ప్యాకేజ్ స్టార్.. రూట్ మార్చిన పాల్

  వారిద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లానికి తెలియకుండా ఇంట్లో ఇల్లాలు హైదరాబాద్ లో ప్రియురాలుగా నడుస్తున్న శ్రీనివాస్ కథకు వాళ్ల అమ్మే మంగళం పాడింది. శ్రీనివాస్ భార్య వీరలక్ష్మి కొన్ని రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. పెళ్లాం ఊరు వెళ్లే సరికి.... ప్రియురాలు లక్ష్మిని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు శ్రీనివాస్. ఇది గమనించిన శ్రీనివాస్ తల్లి.... కొడుకు అతని ప్రియురాలు ఇంట్లో ఉండగా బయట తాళం పెట్టి... కొడలికి సమాచారం అందించింది.

  ఇదీ చదవండి: : వాయువేగంతో దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్ ! ఆ జిల్లాల్లో అధికారులు అలర్ట్

  ఉదయం ఇంటికి చేరుకున్న భార్య వీరలక్ష్మి గ్రామ పెద్దల సమక్షంలో తాళం తెరచి భర్త వ్యవాహారాన్ని బట్టబయలు చేసింది. కట్టుకున్న భార్యను మోసం చేస్తావా అంటూ భర్తను, అతగాడి ప్రియురాలిని చితకబాదింది. కొడుకు అని మమకారం చూపించకుండా.. న్యాయం వైపు నిలబడి..  కోడలికి సపోర్ట్ చేసిన.. ఆ తల్లి నిజంగా గ్రేట్.. అది కూడా మదర్స్ డే నాడు ఆమె చేసిన పనికి అందరూ శెభాష్ అంటున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news

  తదుపరి వార్తలు