హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wife Affair: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. రైలు పట్టాలపై పడుకున్న తండ్రి.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..

Wife Affair: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. రైలు పట్టాలపై పడుకున్న తండ్రి.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Anantapuram: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ప్రేమను గెలిపించుకున్నారు. పదేళ్ల కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త కూడా ఉన్నంతలో ఆమెను బాగానే చూసుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం పక్క చూపులు చూసింది.

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ప్రేమను గెలిపించుకున్నారు. పదేళ్ల కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త కూడా ఉన్నంతలో ఆమెను బాగానే చూసుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం పక్క చూపులు చూసింది. పెళ్లైన పదేళ్లకు కులం గుర్తొచ్చింది. తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం (Extramarital Affair) పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయినా పద్ధతి మార్చుకోలేదు. చివరికి భర్తని, పిల్లల్ని వదిలి వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోవడం, తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పిల్లలు బిక్కిబిక్కుమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరుకు చెందిన శ్రీనివాసులు పదేళ్ల క్రితం కొత్తచెరువుకు చెందిన లావణ్యను ప్రేమ వివాహం చేసుకునాడు. ఇద్దరి కులాలు వేరైనా పెద్దలను ఎదురించి ఆమెను వివాహం చేసుకున్నాడు.

శ్రీనివాస్-లావణ్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే పెళ్లైన కొన్నాళ్ల తర్వాత లావణ్య.. తన కులానికే చెందిన శ్రీనివాస్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజు ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా భర్తకు దొరికిపోయింది. శ్రీనివాసులు పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా నచ్చజెప్పారు. అయినా లావణ్యలో ఎలాంటి మార్పు రాలేదు. ఐతే నెలన్నర క్రితం లావణ్య ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇది చదవండి: భర్తకంటే వాడే ఎక్కువనుకున్నావ్.. కానీ వాడు నిన్నే లేకుండా చేశాడు కదమ్మా..!


దీంతో శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నరగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరక్కపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఏం చేయాలో తెలియక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్లి పుట్టపర్తి ఎయిర్ పోర్టు వద్ద వదిలేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడు. ఐతే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పిల్లల్ని రక్షించారు. ఐతే ఆప్పటికే ఆత్మహత్య చేసుకుందాని రైలు పట్టాలపై పడుకున్న శ్రీనివాస్.. చివరి నిముషంలో పిల్లలు గుర్తొచ్చి మళ్లి తీరిగొచ్చాడు.

ఇది చదవండి: వీడిన అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ.. గోడదూకి ఎక్కడికెళ్లారంటే..!


తాను పిల్లల్ని పోషించలేక వదలిపెట్టి వెళ్లలేదని.. భార్య చేసిన పనికి మనస్తాపంతోనే అలా చేశానని చెప్పాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపాడు. పిల్లల్ని ఎవరైనా పెంచుకుంటారనే ఉద్దేశంలో ఎయిర్ పోర్టు వద్ద వదిలి వెళ్లినట్లు వివరించాడు. ఐతే శ్రీనివాసులు చివరి నిముషంలో మనసు మార్చుకోకపోతే ఆ పిల్లలు ఒంటరివారయ్యేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దారుణంగా మోసం చేయడంతో తట్టుకోలేకపోయానని శ్రీనివాసులు తెలిపాడు. ఇంత జరిగిన తర్వాతైనా ఆ మహాతల్లి తిరిగొస్తుందో లేదో చూడాలి.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs

ఉత్తమ కథలు