హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: ఐదేళ్ల ప్రేమ.. ఆరేళ్ల పెళ్లి.. భార్య అందం ఇప్పుడు గుర్తొచ్చిందా..! వీడ్ని ఏం చేసినా పాపం లేదు..

Anantapuram: ఐదేళ్ల ప్రేమ.. ఆరేళ్ల పెళ్లి.. భార్య అందం ఇప్పుడు గుర్తొచ్చిందా..! వీడ్ని ఏం చేసినా పాపం లేదు..

కుళ్లాయప్ప, అపర్ణ (ఫైల్)

కుళ్లాయప్ప, అపర్ణ (ఫైల్)

Anantapuram: పెళ్లంటే నూరేళ్ల పంట. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్ధం చేసుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకుంటారు. అదే ప్రేమ పెళ్లయితే వివాదాలు, మనస్ఫర్థలకు అవకాశమే ఉండదు. పెళ్లికి ముందే ఇష్టపడటంతో అపార్ధాలకు అవకాశమే లేదు. కానీ ఐదేళ్లు ప్రేమించి, ఆరేళ్లు కాపురం చేసిన తర్వాత భార్య అందం గుర్తొచ్చిందో భర్తకు.

ఇంకా చదవండి ...

పెళ్లంటే నూరేళ్ల పంట. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్ధం చేసుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకుంటారు. అదే ప్రేమ పెళ్లయితే వివాదాలు, మనస్ఫర్థలకు అవకాశమే ఉండదు. పెళ్లికి ముందే ఇష్టపడటంతో అపార్ధాలకు అవకాశమే లేదు. కానీ ఐదేళ్లు ప్రేమించి, ఆరేళ్లు కాపురం చేసిన తర్వాత భార్య అందం గుర్తొచ్చిందో భర్తకు. అదే విషయంలో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చివరకు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడు. వివగాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్యగుడికి చెందిన కుళ్లాయప్ప స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుళ్లాయప్ప ఆరేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు అంగీకరించకపోయినా ఎదిరించి ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. పెళ్లికి ముందు ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెళ్లైన తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్న కుళ్లాయప్ప క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను కొడుతుండేవాడు. నువ్వు అందంగా లేవంటూ భార్యను వేధిస్తుండేవాడు. రోజు రోజుకీ కుళ్లాయప్ప శాడిజం పెరిగిపోతుండటంతో భర్తతో కాపురం చేయలేనని.. విడాకులు తీసుకుంటానని పెద్దలకు చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తాగి ఇంటికొచ్చిన కుళ్లాయప్ప భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

ఇది చదవండి: భర్తతో గొడవపడి విడిపోయింది.. అతడు రెండో పెళ్లి చేసుకోవడంతో ఒళ్లుమండి ఏం చేసిందో చూడండి..!


ఆవేశంలో అపర్ణను కత్తితో పొడాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో పడిఉన్న భార్యను వదిలేసి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను కల్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచనతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. అపర్ణ తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుళ్లాయప్ప కోసం గాలిస్తున్నారు. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న భర్త.. ఇలా అకారణంగా అపర్ణను పొట్టనబెట్టుకున్నాడు. తల్లి హత్యకు గురవడం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో వారి ఇద్దరి పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇది చదవండి: నీ భార్యతో ఉన్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసిన ప్రియుడు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్.


ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో ఇలాంటి ఘటనే జరిగింది. తిరుపతి (Tirupati) నగరంలోని కొర్లగుంటకు చెందిన పద్మకు.. సత్యనారాయణపురంకు చెందిన వేణుగోపాల్ తో 2019లో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. వేణుగోపాల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో భార్యను తీసుకెళ్లి చెన్నైలో కాపురం పెట్టాడు. ఐతే పెళ్లైన కొత్తలో భార్యతో ప్రేమగానే ఉన్న వేణుగోపాల్.. ఆ తర్వాత తనలోనే శాడిజాన్ని బయటపెట్టాడు. భార్యను అనుమానించడం, శారీరకంగా మానసికంగా వేధించడం, తరచూ కొడతుండటంతో అతడి వేధింపులు భరించలేక నాలుగు నెలకే పద్మ పుట్టింటికి వచ్చేసింది.

పెద్దలు ఎన్నిసార్లు సర్దిచెప్పి పద్మను అత్తారింటికి పంపినా వేణుగోపాల్ లో మార్పురాలేదు సరికదా మరింత రెచ్చిపోయేవాడు. ఇక చేసేది లేక విడాకులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు సూచించా.. మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు ఎలా ఉంటాడోనన్న భయంతో.. భర్తనే మార్చుకుంటానంటూ అత్తారింటికి వెళ్లింది పద్మ. ఐతే వెళ్లిన అరగంటకే పద్మను హత్య చేసిన వేణుగోపాల్.. తన ప్రెండ్ సాయంతో శవాన్ని చెరువులో పడేశాడు. ఐదు నెలల పాటు విషయం పద్మ తల్లిదండ్రులకు తెలియకుండా మేనేజ్ చేశాడు. ఐతే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Husband kill wife

ఉత్తమ కథలు