సాగరతీరంలో వెండి నాణెల వర్షం.. ఎగబడిన జనం

ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటివిగా తెలుస్తోంది. ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు తీరంలో వెతుకులాట ప్రారంభించారు. పెద్దఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 3:16 PM IST
సాగరతీరంలో వెండి నాణెల వర్షం.. ఎగబడిన జనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా సాగర తీరంలో వెండి నాణేల తుఫాన్ కురిసింది. తుఫాను కారణంగా సముద్ర అలల ఉద్ధృతికి తీరంలో కూలిన ఇంటి గోడల్లో వెండి నాణేలు కురిశాయి. దీంతో జనం కాస్తా ఎగబడి వెండి నాణాలు ఏరుకున్నారు. పురావస్తు శాఖ ఎప్పుడు వెండి నాణేలు ఎక్కడ లాక్కుపోతారోనని గోప్యంగా దాచేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయి. ఉప్పాడ కొత్తపల్లిలో కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. అలల తాకిడికి కొన్ని ఇళ్లు సైతం కొట్టుకుపోయాయి. సుమారు ఎనిమిది ఇళ్ల వరకు నేలమట్టమయ్యాయి. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కూలిన ఇంటి గోడల్లో నుంచి వెండి నాణేలు రాలిపడ్డాయి. ఓ ఇంటి పునాది గోడ కూలడంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటివిగా తెలుస్తోంది. ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు తీరంలో వెతుకులాట ప్రారంభించారు.

పెద్దఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు.. పూర్వం బొందు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబానికి చెందిన వారు ధనవంతులని ప్రచారం కూడా జరుగుతోంది. ఆ క్రమంలోనే వారు ఇంటి గోడలో ఈ వెండి నాణేలు దాచిపెట్టారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. వందల సంఖ్యలో వెండి నాణేలు స్థానికులకు దొరికినట్టుగా తెలుస్తోంది. ఇక...ఈ విషయాన్ని మాత్రం ఈ ప్రాంత వాసులు గోప్యంగా ఉంచుతున్నారు. వెండి నాణేలు దొరికిన విషయం తెలిస్తే పురావస్తు శాఖ అధికారులు తీసుకెళ్లిపోతారోననే భయంతో స్థానికులు నోరు విప్పడంలేదు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading