Antarvedi: టెన్షన్..టెన్షన్.. అంతర్వేదిలో భారీగా పోలీసుల మోహరింపు

అంతర్వేది

30 పోలీస్ యాక్ట్‌ అమల్లో ఉన్నందున అంతర్వేదిలోనికి ఎవరినీ రానీయడం లేదు. ఇప్పటికే పలువురు బీజేపీ, జనసేన నేతలను అదుపులోకి తీసుకొని నిర్బంధించారు.

  • Share this:
    అంతర్వేది నివురు గప్పిన నిప్పులా మారింది. నేడు చలో అంతర్వేదికి బీజేపీ, జనసేన పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్వేదిలోని లక్ష్మి నరసింహ ఆలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 30 పోలీస్ యాక్ట్‌ అమల్లో ఉన్నందున అంతర్వేదిలోనికి ఎవరినీ రానీయడం లేదు. ఇప్పటికే పలువురు బీజేపీ, జనసేన నేతలను అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. కొత్తపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో బీజేపీ గుంటూరుజిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. ఇక నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 40 మందికి పైగా నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఏలూరు రేంజ్ డీఐజీ వెల్లడించారు. ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన నిపుణులు ఘటనాస్థలంలో అణువణువు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

    మంగళవారం అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయం వద్ద రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావులను అక్కడ ఉన్న ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. రథం దగ్ధమైన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విచారణ భక్తులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు భజరంగ్ దళ్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను ధార్మిక సంఘాలవారు తోసుకొని ముందుకు రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

    తూర్పు గోదావరి జిల్లా... అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన రథం కాలి బూడిదైంది. ఉత్సవ రథం కాలి బూడిదైన ఘటనను బీజేపీ, జనసేన, టీడీపీతో పాటు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే కొందరు అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: