వెక్కిరించిన విధి.. ఆ కుటుంబానికి పూడ్చలేని నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

Fire Accident : కుమార్తెకు ఇటీవలే మంచి సంబంధం దొరికింది. కుమారుడికి కూడా సంబంధం చూసి ఇద్దరి పెళ్లి ఒకేసారి చేసేయాలనుకున్నారు. ఇందుకోసం కొంత డబ్బు కూడబెట్టారు. అదే సమయంలో కొత్త ఇంటిని కూడా నిర్మించుకుంటున్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 10:22 AM IST
వెక్కిరించిన విధి.. ఆ కుటుంబానికి పూడ్చలేని నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అందులో ఉన్న కష్టం,బరువు బాధ్యతల గురించి చెప్పడానికి ఉపయోగించే సామెత ఇది. ఇల్లు కట్టి.. పిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఇక ఆ తల్లిదండ్రులకు అంతకుమించిన ఆనందం ఉండదు. అలాంటిది.. ఓవైపు కొత్త ఇంటి నిర్మాణం, మరోవైపు కుమార్తెకి పెళ్లి నిశ్చయమైన తరుణంలో.. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం కాలి బూడిదైపోతే ఏంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి.తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం అనపర్తివారిపాలెంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పూరి గుడిసె కాలి బూడిదవడంతో.. ఇంటి నిర్మాణం కోసం,కుమార్తె వివాహం కోసం దాచిపెట్టిన డబ్బు బూడిదైపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి బాలకోటయ్య-కూపమ్మ దంపతులకు ఒక కుమార్తె,ఒక కొడుకు ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే మంచి సంబంధం దొరికింది. కుమారుడికి కూడా సంబంధం చూసి ఇద్దరి పెళ్లి ఒకేసారి చేసేయాలనుకున్నారు. ఇందుకోసం కొంత డబ్బు కూడబెట్టారు. అదే సమయంలో కొత్త ఇంటిని కూడా నిర్మించుకుంటున్నారు.ఇల్లు నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా ఓ పూరి గుడిసెకు మకాం మార్చారు. ఇదే క్రమంలో గురువారం బాలకోటయ్య,కూపమ్మ గడ్డి కోసం పొలం వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమార్తె కూపమ్మ.. వంట చేస్తూ.. పొయ్యిని సిమ్‌లో పెట్టి కొత్త ఇంటి వద్దకు వెళ్లింది. కాసేపటికి ఆమె తిరిగిరాగా.. అప్పటికే ఘోరం జరిగింది. పొయ్యి మంట పూరి గుడిసెకు అంటుకుని దగ్ధమైంది. కూపమ్మ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బుతో పాటు,కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచిపెట్టిన డబ్బు కూడా కాలిపోయాయి. అన్నీ పోయి కట్టుబట్టలు మాత్రమే మిగలడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దాదాపు రూ.8లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...