Home /News /andhra-pradesh /

HUGE DOWNFALL IN LEMON PRICE AS FARMERS LOSING THEIR INVESTMENTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Lemon Price: ఒకప్పుడు కిలో రూ.160.. ఇప్పుడు రూ.8.. ఇంతలో ఎంత తేడా..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Lemon Price: మొన్నటి నెల దాకా పెద్ద నిమ్మకాయ ధర పదిరూపాయలు. కొందామంటే నాణ్యమైన నిమ్మకాయ కనిపించలేదు. మార్కెట్లలో డిమాండ్ కి తగ్గ సరఫరా కూడా లేదు. భారీగా నిమ్మధరలు ఉండేవి. కానీ.. ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    P Anand Mohan, News18, Visakhapatnam

    మొన్నటి నెల దాకా పెద్ద నిమ్మకాయ ధర పదిరూపాయలు. కొందామంటే నాణ్యమైన నిమ్మకాయ కనిపించలేదు. మార్కెట్లలో డిమాండ్ కి తగ్గ సరఫరా కూడా లేదు. భారీగా నిమ్మధరలు ఉండేవి. కానీ.. ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిమ్మరైతులు దిగాలు పడే రోజులివి. కేజీ ఎనిమిది రూపాయలు మాత్రమే. పదిరూపాయలకు ఒక నిమ్మకాయ ఎక్కడ..? ఇప్పుడు ఎనిమిదిరూపాయలకు కిలో నిమ్మకాయలు ఎక్కడ..? నెల రోజుల్లో ఎంత మార్పు..? ప్రస్తుతం నిమ్మ ధర నేల చూపులు చూస్తుంది. గత నెల వరకూ అధరహో అనిపించి రైతులను ఆనందంలో ముంచిన ధర కాస్తా తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు నిమ్మ రైతుల పాలిట శాపంగా మారాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముఖ్యంగా ఏలూరు జిల్లా (Eluru District) లోని మెట్ట ప్రాంతాలైన గోపాలపురం, కొయ్యలగూడెం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల తదితర మండలాల్లోని రైతాంగం నిమ్మతోటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొడవున పంట ఉండటంతో నిమ్మతోటలను పాడికుండగా పలువురు అభివ ర్ణిస్తుంటారు. ప్రస్తుతం నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

    ఇది చదవండి: కల్యాణమస్తు రద్దు.. టీటీడీ అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే..!


    ప్రతి ఏటా మార్చి నెల నుంచి మే నెల వరకు వేసవి కారణంగా ఈ పంటకు మంచి డిమాండ్‌ ఉంటుంది. సి విటమిన్‌ ఎక్కువగా ఉండ డంతో వినియోగదారులు నిమ్మను ఎక్కువగా వినియో గిస్తుంటారు. సిట్రిక్‌ యాసిడ్‌తో పాటు తదితర సుగు ణాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. ఇటువంటి నిమ్మను పండించే రైతులకు మాత్రం గత కొంత కాలం గా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది వేసవిలో కిలో నిమ్మకా యల ధర రూ.160 వరకు పలికింది. అప్పట్లో కాయలు లేక రైతులు చెట్టు వైపు కాయల కోసం ఎగాదిగా చూసేవారు.

    ఇది చదవండి: ఈ బామ్మ చేసిన పనికి దండం పెట్టాల్సిందే..! సింగిల్ హ్యాండ్ తో చెక్ డ్యామ్ కట్టేసింది..


    చిన్నసైజు కాయలను కూడా వదలకుండా ధర పై ఉన్న మక్కువతో మార్కెట్‌కు తరలించేవారు. ప్రస్తుతం చెట్ల నిండా కాయలు ఉన్నా మార్కెట్‌లో కిలో నిమ్మధర రూ.8 నుంచి రూ.10లు మాత్రమే పలుకు తోంది. దీంతో కోత ఖర్చులు కూడా రావని రైతాంగం అంటున్నారు. పెద్ద నిమ్మకాయలు కిలోకు 12 నుంచి 15.. చిన్న నిమ్మ కాయలు అయితే 20 వస్తాయి. ధర తక్కువగా ఉండడంతో కాయలు కొయ్యకుండా వది లేద్దామంటే చెట్టుకు భారమై అవి కుళ్ళిపోవడం ద్వారా చెట్లకు వైరస్‌ సోకుతుందని కొందరు రైతులు చెబుతున్నారు. ఈ నేపద్యంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఏమిచేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. పక్వానికి వచ్చిన కాయలు కోయడానికి వీలు లేక చెట్లుకే పండిపోయి రాలిపోతున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Lemon

    తదుపరి వార్తలు