• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • HUGE DEMAND FOR DONKEY MILK IN ANDHRA PRADESH PEOPLE BELIEVING THAT DONKEY MILK WILL CURE MANY DISEASE FULL DETAILS HERE PRN

Donkey Milk: గాడిద పాలతో ఇన్ని లాభాలున్నాయా..? అందుకే అంత ధర..!

ఏపీలో గాడిద పాలకు డిమాండ్

Donkey Milk: గంగిగోవు పాలు గరిటెడైనా చాలు.. ఇది పాత సామెత.. గాడిద పాలు గ్లాసుడైనా చాలు.. ఇది కొత్త సామెత.

  • Share this:
    గంగిగోవు పాలు గరిటెడైనా చాలు.. ఇది పాత సామెత.. గాడిద పాలు గ్లాసుడైనా చాలు.. ఇది కొత్త సామెత. అవును ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికే కాదు.. గాడిపాలకు కూడా గిరాకీ పెరుగుతుంది. గాడిద పాలలో ఔషధ గుణాలుంటాయని.. తాగితే మంచిదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే గాడిద పాలకు డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గాడిదల సంఖ్య తక్కువగా ఉన్నందున మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకొచ్చి పాలు, మాంసం విక్రయిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో లీటర్ గాడిద పాల ధర దాదాపు రూ.1500 వరకు ఉంది. డిమాండును బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చిన్న కప్పు పాల ధర వందల్లోనే ఉంటోంది. ఇప్పటికప్పుడే పాలు తీసి విక్రయిస్తుండటంతో జనం ఎగబడుతున్నారు.

    గాడిద పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని.. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందని జనం నమ్ముతారు. అలాగే గాడిద పాలల్లో ముసలితనం ఛాయలు పొగొట్టే గుణం కూడా ఉందని నమ్ముతారు. గాడిద పాలతో స్నానం చేస్తే ముసలినతం పోతుందని.. నిత్యయవ్వనంగా ఉండొచ్చని భావించేవారి సంఖ్య కూడా ఎక్కువే. గాడిద మాంసం విషయానికి వస్తే ఇటీవల ఏపీలో గాడిద మాంసం విక్రయాలు బాగా పెరిగాయి. గాడిద మాంసంతో లైంగిక పటుత్వం వస్తుందని.. లైంగిక సమస్యలు కూడా పోతాయన్న నమ్మకం జనాల్లో ఉంది. కిలో మాంసం ధర రూ.3వేలకు పైగా ఉందంటే దానికి ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

    పసిడి వర్ణంలో పాలు
    గుజరాత్‌లో హాలరీ గాడిదలుంటాయి. అవి ప్రత్యేక జాతి గాడిదలు. దాదాపు బంగారం రంగులో కనిపించే ఆ గాడిద పాలను లీటర్ రూ.6,000కు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇప్పుడు కాదు... ప్రాచీన కాలం నుంచే విపరీతమైన డిమాండ్ ఉంది. ఈజిప్టులో ఒకప్పటి రాణి క్లియోపాత్రా... గాడిద పాలతో స్నానం చేసేది. ఆ పాలు ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. ఈ పాలలో యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. ఇవి మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమేస్తాయి. ఈ హాలరీ గాడిదలు... గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంటాయి. వీటి పాల గొప్పదనం తెలిసి... హర్యానాలోని ది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వేషన్స్... డాంకీ మిల్క్ డైరీ ప్రారంభించాలనుకుంటోంది.

    200 ఏళ్లకు పైగా ఈ గాడిదల్ని హాలరీ గాడిదలు అంటారు. గుర్రాల కంటే చిన్నగా ఉంటాయి. ఐతే... ఇతర గాడిదల కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి. 200 ఏళ్లుగా హాలరీ ప్రాంతంలో వీటిని ప్రత్యేకంగా పాల కోసం సాకుతున్నారు. 1540లో... స్వామి జామ్ శ్రీ హాలాజీ జడేజా... హాలరీకి ఈ గాడిదల్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ గాడిదల గొప్పదనం చాలా మందికి తెలియదు. హాలాజీ మాత్రం వీటిని శ్రద్ధగా పెంచుతూ... అందరికీ వీటి గొప్పదనాన్ని వివరించారు. ప్రస్తుతం ఈ గాడిదల పాలను కాస్మొటిక్ ఉత్పత్తులు, సోప్స్, ఫేస్ వాషెస్లో వాడుతున్నారు. ఈ పాలు... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నాయి. మనుషుల్లో నీరసాన్ని ఇవి తగ్గించగలుగుతున్నాయి.

    ఇక సెర్బియా లాంటి దేశాల్లో గాడిద పాల నుంచి చీజ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. కిలో గాడిద పాల చీజ్ ధర ఏకంగా రూ.80వేల వరకు ఉంది. 50 గ్రాముల నుంచి కిలో వరకు వీటిని విక్రయిస్తున్నారు. 25 లీటర్ల గాడిద పాలతో ఒక్క కిలో చీజ్ తయారవుతుందట.
    Published by:Purna Chandra
    First published: