మీ గ్రామ వాలంటీర్ ఎవరో తెలియట్లేదా... ఇలా చెయ్యండి

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లుగా, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఐతే... గ్రామ వాలంటీర్లు తమ దగ్గరకు రావట్లేదని చాలా మంది అంటున్నారు. అప్పుడేం చెయ్యాలి?

Krishna Kumar N | news18-telugu
Updated: November 30, 2019, 7:26 AM IST
మీ గ్రామ వాలంటీర్ ఎవరో తెలియట్లేదా... ఇలా చెయ్యండి
(ప్రతీకాత్మక చిత్రం, File Photo: AP CM YS Jagan)
  • Share this:
Andhra Pradesh : గత టీడీపీ ప్రభుత్వం... పథకాలు, ఇతరత్రా సేవల్ని అందించేందుకు మీసేవను తీసుకురాగా... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం... మీసేవను కొనసాగిస్తూనే... గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలనే ఉద్దేశంతో, ఎన్నో ఉన్నతాశయాలతో వైసీపీ ప్రభుత్వం... గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. ఐతే... కొన్ని సమస్యలు ఈ వ్యవస్థకు ఇప్పటికీ సవాళ్లు విసురుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచీ గ్రామ వాలంటీర్లకు... ఒక్కొక్కరికీ 50 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఆ ఇళ్లకు వాలంటీర్లు... రేషన్ సరుకులు సప్లై చేయాల్సి ఉంది. అలాగే... ప్రతీ గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర్... తనకు అప్పగించిన 50 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని రెడీ చేసుకోవాలి. ఆ ఇళ్లలో ఎంత మంది ఉంటున్నారు. చదువుకుంటున్నదెవరు? ఎవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలి? ఏయే పథకాలు ఎవరెవరికి వర్తిస్తాయి? ప్రభుత్వం తెస్తున్న కొత్త పథకాలు, వాటి వివరాలు... ఇలాంటి సమాచారం మొత్తం వాలంటీర్ల దగ్గర ఉండాలి. కానీ... చాలా మంది వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లకు సరిగా వెళ్లట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు చాలా ఇళ్లలో వారికి... తమ గ్రామ వాలంటీర్ ఎవరో తెలియదు. ఆ వాలంటీర్ ఫోన్ నంబర్ కూడా వాళ్ల దగ్గర లేని పరిస్థితి. అందువల్ల ప్రజలు ఎప్పటిలాగే... మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం తెస్తున్న ఆసరా, చేయూత, భరోసా ఇలాంటి రకరకాల పథకాల పూర్తి వివరాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివరాలు చెప్పేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఆసక్తి చూపట్లేదు. గ్రామ వాలంటీర్లను అడగమంటున్నారు. గ్రామ వాలంటీర్లేమో తమ దగ్గరకే రావట్లేదని ప్రజలు అంటున్నారు. ఇలాగైతే... వైసీపీ ప్రభుత్వ ఆశయం నెరవేరేదెలా?

ఇలా చెయ్యండి : గ్రామ వాలంటీర్ల పూర్తి వివరాలు ఆయా గ్రామాల్లోనీ పంచాయతీ ఆఫీసుల్లో ఉంటాయి. అందువల్ల తమ ఇంటికి, తమ గ్రామానికి, తమ వార్డుకి సంబంధించిన వాలంటీర్ ఎవరో తెలుసుకునేందుకు పంచాయతీ ఆఫీస్‌కి వెళ్లి వివరాలు కోరవచ్చు. గ్రామ వాలంటీర్ పేరు, ఫోన్ నంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ చేసినప్పుడు గ్రామ వాలంటీర్ స్పందించకపోయినా, వస్తానని ఇంటికి రాకపోయినా... ఆ వాలంటీర్‌పై పంచాయతీ ఆఫీస్‌లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. ప్రభుత్వ సేవల్ని పొందే హక్కు ప్రజలకు ఉంటుంది. ఆ సేవలు పొందనప్పుడు అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోమని కోరే హక్కు ప్రజలకు ఉంది.

ప్రభుత్వం తెస్తున్న ప్రతీ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ వాలంటీర్లు... తమకు కేటాయించిన 50 ఇళ్లలో వారికి చెప్పి తీరాల్సిందే. అలా చెప్పకుండా, ఆ పథకం ప్రయోజనం అందకుండా చెయ్యడం నేరం అవుతుంది. అలాంటి వాలంటీర్లపై చర్యలు తీసుకోమని కోరే హక్కు బాధితులకు ఉంటుంది. అందువల్ల గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతల్ని కచ్చితంగా నిర్వర్తించాల్సిందే. లేదంటే వైసీపీ ప్రభుత్వ ఆశయాలు, అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అసౌకర్య పరిస్థితులను ప్రభుత్వం చక్క దిద్దాల్సిన అవసరం ఉంది.

 


Pics: జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ క్యూట్ స్టిల్స్
ఇవి కూడా చదవండి :భర్తను నరికి చంపిన భార్య... కారణం ఇదీ...

ప్రజలను మోసంచేస్తున్న ఎలుగుబంటి... డాన్స్ చేస్తూ...

నేడు మహారాష్ట్రలో బలపరీక్ష... ఏం జరుగుతుంది?

బంగారం కొంటున్నారా... కొత్త రూల్స్ తెలుసుకోండి మరి...

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>