చంద్రగహణం : ఏ రాశి వారిపై ఎలాంటి ఎఫెక్ట్..

చంద్రగహణం : ఏ రాశి వారిపై ఎలాంటి ఎఫెక్ట్..

రాశిచక్రం

ప్రముఖ జ్యోతిష్కులు రాళ్లపల్లి వెంకటేశ్వర శర్మ, విజయవాడ. (srivatcha@gmail.com)

 • Share this:
  స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సర ఆషాఢ శు॥ పూర్ణిమ, మంగళవారం (రాత్రి తెల్లవారితే బుధవారం) అనగా తేదీ 16-7-2019 తెల్లవారితే 17-7-2019 అర్థరాత్రి 1.31 గంటల నుండి 4.29 ని॥ల వరకు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. ఆద్యంతం ఈ గ్రహణం మొత్తం సమయం 2.58 గంటలకు,గ్రహణ స్పర్శ కాలం రా॥ గం॥ 1.31 గంటలకు, మధ్యకాలం రాత్రి 3:01 గంటలకు,మోక్ష కాలం తెల్లవారుజామున గం॥ 4.29 గంటలకు ఈ గ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం ధనస్సు రాశినందు సంభవించును. కానీ మూల,పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ధనూరాశి జాతకులు మరియు మకర రాశి వారు కూడా ఈ గ్రహణమును చూడరాదు.

  రాశులపై చంద్రగహణ ప్రభావం :

  కర్కాటకం,మీనం,తులా,కుంభరాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం ఉండదు.మేష,సింహ,వృశ్చిక రాశులవారికి సామాన్యంగా ఉండును.
  వృషభ, మిధన, కన్యా, ధనస్సు, మకర రాశుల వారికి మాత్రం ప్రభావం అధికంగా ఉంటుంది.
  ముఖ్యంగా ధనస్సు, రాశివారికి జన్మము నందు మరియు మకర రాశివారికి
  12వ స్థానము నందు వచ్చినందునా శారీరకంగా, జీర్ణకోశ మరియు ఉదర సంబంధిత
  వ్యాధులకు దారితీసే అవకాశం కలదు. దీనివల్ల అజీర్ణ వ్యాధి మరియు ప్రేగులకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం కలదు.
  వృషభ రాశి మరియు మిధున రాశి వారికి 7 మరియు 8 స్థానాలలో గ్రహణం సంభవించడం వలన అనారోగ్యం, భయాందోళనలు కలిగి మానసికమైన ఒత్తిళ్ళు
  కలిగే అవకాశం ఉంది.
  కన్యా రాశివారికి 4వ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల విద్యార్థులకు విద్యయందు శ్రద్ధ తగ్గడం, బద్ధకం, మందగొండితనం కలగడం లాంటివి సంభవించవచ్చును.
  ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వారి వృత్తుల్లో ఒత్తిళ్ళు మరియు చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.

  గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  గ్రహణ సమయం ప్రారంభానికి 9 గంటల ముందు తినాలి.
  గ్రహణం ప్రారంభం
  అయ్యాక ఎటువంటి ఆహారం ఉదరంలో ఉండటం మంచిది కాదు. వాటివల్ల గ్రహణ సమయంలో అవి విషమరసాలుగా ఉత్సన్నమయ్యి దీర్ఘకాలిక వ్యాధులకి దారితీస్తుంది.
  సామాన్యంగా ఈ గ్రహణ ప్రభావం శరీరంలో ముఖ్యంగా ఉదరంలోనే ఎక్కువగా
  ఉంటుంది. ఈ విషయం అందరికీ వర్తిస్తుంది.

  గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు..

  గ్రహణ ప్రారంభం మరియు అంత్య సమయాలలో తలస్నానం చేయాలి.
  స్పర్శ స్నానం చేసి మోక్ష కాలం వరకు దైవ ధ్యానం మరియు గాయత్రీ మొదలగు ఉపదేశ మంత్రాలు జపం చేయడం విశేషం.
  గ్రహణ సమయం అనంతరం దానాలు చేయడం మంచిది.
  (ముఖ్యంగా ఈ సమయంలో జపం లేదా దానం చేసిన ఫలం మామూలు రోజులలో
  చేసిన ఫలం కంటే పదిరెట్లు ఎక్కువ అని గురువులు చెప్పినటువంటి మాట.

  గ్రహణ సమయంలో చేయవలసిన దానద్రవ్యాలు

  నక్షత్రానికి బియ్యం
  చంద్రుడికి బియ్యం
  కేతువుకి ఉలవలు
  వెండి చంద్రబింబం

  రాగి పాత్ర

  ఆవునెయ్యి
  Published by:Srinivas Mittapalli
  First published: