కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే... పూర్తి వివరాలు ఇవిగో...

AP Assembly Election Results 2019 : ఈ మొత్తం ప్రక్రియ అంత తేలిగ్గా అయిపోదు. పూర్తిస్థాయిలో అధికారికంగా ఎవరెవరు గెలిచారో ప్రకటించేసరికి రాత్రి అవ్వడం ఖాయం.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 6:11 AM IST
కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే... పూర్తి వివరాలు ఇవిగో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మే 23... ఈ తేదీ కోసం ప్రస్తుతం 100 కోట్ల మందికి పైగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ రోజున జరిగే కౌంటింగ్, వెల్లడించబోయే ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా గెలుపు ఎవరిది అన్నది టెన్షన్ కలిగిస్తోంది. ఐతే... ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చెయ్యాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలది. ఇప్పటికే ఏజెంట్లకు, ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ క్లాసులు చివరి దశకు వచ్చాయి. ఏ అధికారి ఏం చెయ్యాలన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఐదు రోజుల తర్వాత అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి... తమకు అప్పగించిన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐతే... మే 23న ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది ఆసక్తికరం.

మే 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో 12 నుంచీ 14 టేబుళ్ల చొప్పున సెట్ చేయనున్నారు. అసెంబ్లీ, లోక్ సభకు వేర్వేరుగా టేబుళ్లు ఉంటాయి. ప్రతి రౌండ్‌కీ 10 నుంచీ 15 వేల ఓట్లను లెక్కించి, రౌండ్ వారీగా ఫలితాల్ని ప్రకటిస్తారు. ఇలా 18 నుంచీ 30 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. మామూలుగా అయితే... మధ్యాహ్నం కల్లా ఫలితాల సరళి తెలుస్తుంది. ఈసారి ఫలితాలు కాస్త ఆలస్యం అవుతాయి. ఇందుకు కారణం వీవీప్యాట్ ఓట్ల లెక్కింపే. మధ్యాహ్నం 2 నుంచీ 4 గంటల మధ్యలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఏ పార్టీలు గెలుస్తున్నాయో తెలిసే ఛాన్స్ ఉంది. అప్పటికి ఫైనల్ రిజల్ట్స్ రాకపోయినా, ఏ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారో తెలిసిపోతుంది. తద్వారా మనం ఓ అంచనాకు వచ్చేయగలం.

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే... వెంటనే లాటరీ విధానం ద్వారా ఐదు వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్పులను, ఈవీఎంలలో పోలైన ఓట్లతో పోల్చి చూస్తారు. అంటే ఈవీఎంలలో ఏ పార్టీ గుర్తుకి ఎన్ని ఓట్లు వచ్చాయో... స్లిప్పులలో కూడా ఆ పార్టీ గుర్తుకి అన్నే ఓట్లు వచ్చాయో లేదో పోల్చి చూస్తారు. లెక్క సరిపోతే... అప్పుడు ఆన్‌లైన్‌లో ఫలితాన్ని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఓట్ల ఫలితాలన్ని ప్రకటిస్తారు.

ఈ మొత్తం ప్రక్రియ మనం చెప్పుకున్నంత తేలిగ్గా అయిపోదు. పూర్తిస్థాయిలో అధికారికంగా ఎవరెవరు గెలిచారో ప్రకటించేసరికి రాత్రి అవ్వడం ఖాయం. అందువల్ల మనం ఈ ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. టైం అయితే ఆటోమేటిక్‌గా వాళ్లే ప్రకటిస్తారు. ఇక సోషల్ మీడియా, ఛానెళ్లు ఎలాగూ ఫలితాల్ని చూపిస్తాయి. వీటికి అదనంగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలు ఉంటాయి. అక్కడైనా చూసుకోవచ్చు.ఇవి కూడా చదవండి :

ఫలితాల కోసం వైసీపీ సన్నద్ధం... టీడీపీ తీరుపై ఆందోళన...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...
Published by: Krishna Kumar N
First published: May 17, 2019, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading