బిల్లు కట్టలేదని అవయవదానం పేరిట కిడ్నీలు, కళ్లు తీసుకున్న ఆస్పత్రి?

ఆస్పత్రి వారు ఇచ్చిన పేపర్ మీద సంతకాలు పెట్టానని, దీంతో వారు అవయవదానం కింద తన భర్త రెండు కళ్లు, రెండు కిడ్నీలు, గుండెను తీసుకున్నారని ఆరోపించింది.

news18-telugu
Updated: April 24, 2019, 12:33 PM IST
బిల్లు కట్టలేదని అవయవదానం పేరిట కిడ్నీలు, కళ్లు తీసుకున్న ఆస్పత్రి?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి భార్య బిల్లు కట్టలేనని చెప్పడంతో అతని అవయవాలు దానం చేయాల్సిందిగా సూచించి, వాటిని తీసుకున్నారని డెక్కన్ క్రానికల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని వడ్డెపుగుంట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి వెంటనే శ్రీనివాసులును హైవేకు దగ్గరగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. అతడి చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం రూ.20వేలు చెల్లించాడు. ఆ తర్వాత విషయం తెలిసిన శ్రీనివాసులు భార్య అరుణ తర్వాత రోజు ఆస్పత్రికి వెళ్లింది. ఆమె భర్తకు బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. అయినా, బతుకుతాడన్న గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. దీంతోపాటు అప్పటి వరకు చేసిన చికిత్సకు అయిన బిల్లు రూ.లక్ష చెల్లించాల్సిందిగా సూచించారు.

అంతకు ముందు చెల్లించిన రూ.20వేలకు అదనంగా మరో రూ.లక్ష అడగడంతో తన వద్ద లేవని అరుణ.. వైద్యులకు తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి శ్రీనివాసులు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పారు. అప్పటి వరకు చికిత్స అందించినందుకు బిల్లు రూ.లక్ష చెల్లించి బాడీని తీసుకెళ్లవచ్చని సూచించారు. అయితే, తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో భర్త అవయవాలు దానం చేయాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు ఆమె ఓ కమిటీ ముందు తెలిపింది. అవయవాలు దానం చేస్తే రూ.లక్ష కట్టాల్సిన అవసరం లేదని, దీంతోపాటు భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఫ్రీగా వైద్య చికిత్సలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపింది. చికిత్స కోసం కట్టిన రూ.20వేలు కూడా తిరిగి ఇచ్చేరారని వివరించింది.

ఆ తర్వాత ఆస్పత్రి వారు ఇచ్చిన పేపర్ మీద సంతకాలు పెట్టానని, దీంతో వారు అవయవదానం కింద రెండు కళ్లు, రెండు కిడ్నీలు, గుండెను తీసుకున్నారని ఆరోపించింది. అవయవాలను తీసేసుకుంటారని తెలిస్తే తాను సంతకం పెట్టేదాన్ని కాదని ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు కలెక్టర్ ముత్యాలరాజు విచారణకు ఆదేశించినట్టు ఆ పత్రిక తెలిపింది.

ఈ విషయంపై ఆస్పత్రి చైర్మన్ కె.రవీంద్రరెడ్డిని డీసీ ప్రతినిధి సంప్రదించగా, అరుణకు అవయవదానం గురించి వైద్యులు అన్ని విషయాలు చెప్పిన తర్వాతే తీసుకున్నామని, ఆమె అంగీకారంతోనే ఇదంతా జరిగిందని ఆయన వివరించారు.
First published: April 24, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading