హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nandamuri Bala Krishna: రంగంలోకి దిగిన అఖండ.. హిందూపురం కోసం బాలయ్య మౌనదీక్ష..

Nandamuri Bala Krishna: రంగంలోకి దిగిన అఖండ.. హిందూపురం కోసం బాలయ్య మౌనదీక్ష..

Balakrishna: జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ స్థాని ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళనకు దిగారు. హిందూపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు.

Balakrishna: జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ స్థాని ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళనకు దిగారు. హిందూపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు.

Balakrishna: జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ స్థాని ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆందోళనకు దిగారు. హిందూపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటుపై మొదలైన రగడ తారాస్థాయికి చేరుకుంటోంది. జిల్లాల విభజనపై అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న డిమాండ్లు స్థానికులతో పాటు రాజీకీయ పార్టీల నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ స్థాని ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) ఆందోళనకు దిగారు. హిందూపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం వచ్చిన బాలకృష్ణ శుక్రవారం తన ఇంటి నుంచి బయలుదేరిన బాలకృష్ణ పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్షను ప్రారంభించారు.

  ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసి హిందూపురాన్ని హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించడానికి బదులు.. హిందూపురం లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తూ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హిందూపురంకు అన్యాయం చేస్తున్నారంటూ స్థానిక రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. పార్టీలకతీతంగా నేతలు కూడా హిందూపురం జిల్లాను డిమాండ్ చేస్తున్నారు.

  ఇది చదవండి: కొత్త జిల్లాల ఎఫెక్ట్.. ఏపీలో భూముల ధరలకు రెక్కలు..పెరగనున్న మార్కెట్ విలువ


  ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం జిల్లా కోసం రంగంలోకి దిగారు. హిందూపురం జిల్లా సాధనకోసం ఎంతటిపోరాటానికైనా సిద్ధమని ప్రకటించిన బాలకృష్ణ.. చెప్పినట్లుగానే శుక్రవారం పట్టణంలో మౌనదీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానిటి టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నేతలు, బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు.

  ఇది చదవండి: ఏపీలో కొత్త జిల్లాలతో ఆ వ్యవస్థ మారుతుందా..? ఐటీడీఏలు కొనసాగుతాయా..?


  ఐతే హిందూపురంపై పట్టు పెంచుకునేందుకు బాలకృష్ణ ఈ రకమైన కార్యక్రమానికి పిలుపునిచ్చారనే చర్చ కూడా సాగుతోంది. అయితే బాలకృష్ణ డిమాండ్‌కు ఏపీ సీఎం జగన్ ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయా ? అన్నది సందేహమే. స్థానిక వైసీపీ నేతలు సైతం ఇదే రకమైన డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ.. జనంలో మాత్రం దీనిపై బాలకృష్ణ చేస్తున్న పోరాటమే ఎక్కువగా కనిపిస్తోంది.


  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూతపై సీఎం క్లారిటీ... ఆ ప్రచారంలో నిజంలేదన్న సర్కార్..


  మరోవైపు బాలకృష్ణ డిమాండ్‌ను వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు పెద్దగా లేవనే చర్చ సాగుతోంది. ఒకవేళ బాలకృష్ణ డిమాండ్ చేయడం వల్లో లేక సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేయడం వల్లో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులుగా హిందూపురంను ఏర్పాటు చేస్తే.. మిగతా జిల్లాల విషయంలో ఇదే రకమైన కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, AP new districts, Bala Krishna Nandamuri, TDP

  ఉత్తమ కథలు