కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లో హైటెన్షన్ నెలకొంది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) కి చెందిన కన్వెన్షన్ సెంటర్ ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ (TDP) నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత పామర్ర బైపాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం 10వాహనాలు మాత్రమే గుడివాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అక్కడి నుంచి నేరుగా గుడివాడ టీడీపీ కార్యాలయానికి చేరుకున్న నేతలు కే కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొడాలి నాని అనుచరులు, వైసీపీ కార్యకర్తలు.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కారు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటే అవకాశముండటంతో టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ నేతలను అడ్డుకోవడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. “మహానుభావుల పురిటిగడ్డ గుడివాడని భ్రష్టు పట్టించింది గడ్డం గ్యాంగ్. మింగడానికి ఏమి మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేసారు. కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసినా వైసిపి రంగులతో కళ్ళు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదు. క్యాసినో నడిపి ప్రజల నుండి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ని వదిలేసి నిజ నిర్దారణకు వెళ్లిన టిడిపి నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.
మహానుభావుల పురిటిగడ్డ గుడివాడని భ్రష్టు పట్టించింది గడ్డం గ్యాంగ్. మింగడానికి ఏమి మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేసారు. కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసినా..(1/3)#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/CVmtYCcRyF
— Lokesh Nara (@naralokesh) January 21, 2022
సంక్రాంతి పండగ (Sankranthi Fesitval) సందర్భంగా గుడివాడ (Gudivada)లో రేగిన రచ్చ ఇంకా చల్లారలేదు. గుడివాడలోని మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) కి చెందిన కే కన్వెన్షన్ లో క్యాసినో ఏర్పాటు చేశారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతోంది. పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కోడిపందేలు, జూదం ఒక ఎత్తైతే.. గుడివాడ క్యాసినో ఒక ఎత్తు అనే చందంగా అక్కడ జూదం, చీర్ గర్ల్స్ తో డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు రూ.10వేల ఎంట్రీ ఫీజు.. అందులో రూ.4వేలు టోకెన్లుగా ఇచ్చి మరీ జూదం ఆడించినట్లు ఆరోపణలు వినిపించాయి. గోవా నుంచి జూద నిర్వాహకులను తీసుకొచ్చి మరీ కాయ్ రాజా కాయ్ అంటూ ఆడించారు. ఐతే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని కొందరు.. మంత్రి సంక్రాంతి సందర్భంగా వందల కోట్ల బిజినెస్ చేశారని మరికొందరు ఆరోపించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, TDP, Ysrcp