తెనాలిలో తీవ్ర ఉద్రిక్తత.. అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు

అమరావతి కోసం దీక్ష చేస్తున్న జేఏసీ నేతలు, కార్యకర్తలుపై ఆందోళనకారులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారు. వైసీపీ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు దీక్షా శిబిరంలోకి చొరబడి తగులబెట్టారు. అనంతరం రోడ్డుపై చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు.


Updated: January 25, 2020, 5:27 PM IST
తెనాలిలో తీవ్ర ఉద్రిక్తత.. అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు
తెనాలిలో ఉద్రిక్తత
  • Share this:
మూడు రాజధానుల అంశంపై ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాయలం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతి జేఏసీ రిలే దీక్షా శిబిరం వద్ద ఘర్షణ జరిగింది. అమరావతి కోసం దీక్ష చేస్తున్న జేఏసీ నేతలు, కార్యకర్తలుపై ఆందోళనకారులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారు. వైసీపీ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు దీక్షా శిబిరంలోకి చొరబడి తగులబెట్టారు. అనంతరం రోడ్డుపై చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. అడ్డుకునేందుకు వచ్చిన జేఏసీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పరస్పరం కొట్టుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

తెనాలిలో జేఏసీ దీక్షా శిబిరంపై దాడిచేసిన ఘటనను నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. రైతులు శాంతియుతంగా దీక్ష చేస్తున్న జేఏసీ శిబిరాన్ని వైసీపీ రౌడీలు తగులబెట్టారని ట్విటర్ వేదికగా ఆయన ఆరోపించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని.. రైతులపై దాడిచేసిన వారు నాశనం అయిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.


First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు