హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రోహిణి కార్తె.. ఏపీలో మాడు పగిలే ఎండలు.. హెచ్చరించిన ఐఎండీ..

రోహిణి కార్తె.. ఏపీలో మాడు పగిలే ఎండలు.. హెచ్చరించిన ఐఎండీ..

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

రోహిణి కార్తె వచ్చేస్తోంది.. ఈ కాలంలో ఎండలకు రోకళ్లు కూడా పడిగేలా ఎండలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది.

రోహిణి కార్తె వచ్చేస్తోంది.. ఈ కాలంలో ఎండలకు రోకళ్లు కూడా పడిగేలా ఎండలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. రేపటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాడ్పుల ముప్పు ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని తెలిపింది. మరోవైపు, గుంటూరు జిల్లా రెంటచింతలను గత మూడు రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. నిన్న ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండ సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.

First published:

Tags: AP News, WEATHER

ఉత్తమ కథలు