మండుతున్న ఎండలు... మరో నాలుగు రోజులు వడగాల్పులు

మరో నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వడగాల్పులు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

news18-telugu
Updated: June 13, 2019, 8:15 AM IST
మండుతున్న ఎండలు... మరో నాలుగు రోజులు వడగాల్పులు
తెలుగురాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
news18-telugu
Updated: June 13, 2019, 8:15 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మండిపోతున్నాడు. 8 దాటితో ఎర్రగా మండుతూ సూర్యూడు మంటలు కురిపిస్తున్నాడు. జూన్ వచ్చినా కూడా ఏ మాత్రం ఎండలు తగ్గలేదు సరికదా.. ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వడగాల్పులు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో ఈ పరిస్థితులు మరో నాలుగు రోజులు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి స్పష్టం చేశాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదైనట్టు పేర్కొన్నారు. దక్సిణ కోస్తాలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు చూస్తుంటే గన్నవరం 44 డిగ్రీలు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, కావలి 44 డిగ్రీలు, తుని కాకినాడలో 42 డిగ్రీలు, నర్సాపురంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు గుజరాత్‌లో వాయు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ఇవాళ మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాని వాయు తుఫానుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందుగానే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. వాయు తుఫారు తీరం దాటాకే... రుతుపవనాలు.. తెలుగురాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...