ఏపీపై నిప్పులు గక్కుతున్న సూరీడు..!

Shiva Kumar Addula | news18
Updated: May 30, 2018, 10:13 AM IST
ఏపీపై నిప్పులు గక్కుతున్న సూరీడు..!
  • News18
  • Last Updated: May 30, 2018, 10:13 AM IST
  • Share this:


కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. నైరుతి రాకతో కేరళ, కర్నాటక, లక్షద్వీప్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.  ఐతే తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రావడానికి రో నాలుగు రోజులలు పట్టే అవకాశముంది.  ఆ లోపు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వారు చెప్పినట్లుగానే రెండు చోట్లా తీవ్ర ఉక్కపోత, వేడి పరిస్థితులు నెలకొన్నాయి. వాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా ఎండల తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు.

వాయువ్య భారత్ లోని రాజస్థాన్, గుజరాత్ లో 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ, చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ, కోస్తాంధ్ర వరకూ వేడి గాలుల ప్రభావం ఉండడంతో.. ఆయా ప్రాంతాల్లో40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో గరిష్టంగా నెల్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

కర్నూలు, అమరావతి, ఒంగోలుల 44, గుంటూరు, తిరుపతిలో 43, కడపలో 42, విజయనగరం, రాజమండ్రిలో 41 డిగ్రీలు నమోదయ్యాయి.  ఇక శ్రీకాకులం, అనంతపురంలో 40,  విశాఖలో 38, కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading