గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్

Andhra Pradesh : ఏపీలో వ్యభిచారం మూడు హోటళ్లు... 30 జంటల్లా సాగుతోందా? పోలీసుల తనిఖీల్లో అంతమంది దొరకడం ఆశ్చర్యకరమే.

news18-telugu
Updated: November 23, 2019, 6:49 AM IST
గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్
గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్
  • Share this:
Andhra Pradesh : గుంటూరు పోలీసులకు ఎవరో కాల్ చేశారు. ఫలానా హోటళ్లలో వ్యభిచారం హ్యాపీగా సాగుతోందని చెప్పారు. అలర్టైన గుంటూరు జిల్లా ఎస్పీ... ఆర్డర్స్ జారీ చేశారు. అంతే... మొత్తం 50 మంది పోలీసులు రాత్రికి రాత్రి హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో జోరుగా తనిఖీలు చేశారు. బైపాస్ రోడ్డులోని విక్టరీ గ్రాండ్, అన్నపూర్న నిలయం లాడ్జిల్లో పోలీసుల దాడులు జరిగాయి. ప్రతీ తలుపూ తట్టారు. ఈ దాడుల్లో... చాలా చోట్ల వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది. మొత్తం 70 మంది జంటల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఎంత మంది నిజమైన జంటలు, ఎంతమంది ప్రాస్టిట్యూటర్లు అన్నది పోలీసులు తేల్చనున్నారు. ఐతే... ఇంతమంది పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ఒక్క గుంటూరులో... కేవలం కొన్ని హోటళ్లలోనే ఇంతలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే... జిల్లా మొత్తంగా ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? ఏపీ మొత్తంగా పరిస్థితి ఏలా ఉంది అన్న డౌట్ పోలీసులకు వస్తోంది.

ఆన్‌లైన్‌లో హోటల్స్ బుక్ చేసుకుంటున్న విటులు... సైలెంట్‌గా హోటల్‌కి వెళ్లి... రూం కీ తీసుకుంటున్నారు. రూంలోకి వెళ్లి... అమ్మాయికి కాల్ చేస్తున్నారు. హోటల్ చుట్టుపక్కలే వెయిట్ చేస్తున్న అమ్మాయి... ముసుగు వేసుకొని... సైలెంట్‌గా హోటల్‌లో తనకు చెప్పిన రూంకి వెళ్లిపోతోంది. ఇలా గుట్టుగా వ్యభిచారం జరుగుతుంటే... హోటళ్ల యాజమాన్యాలు... ఏం జరిగితే మాకెందుకు... మా డబ్బులు మాకొస్తున్నాయి అది చాలు అనుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నా్రు. రైడింగ్‌లో దొరికిన అమ్మాయిల పేరెంట్స్‌ని పిలిపించి... వాళ్ల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పిస్తామంటున్నారు పోలీసులు.

Pics : సన్నబడిన ఇలియానా హాట్ అందాలు చూసి తీరాల్సిందే
ఇవి కూడా చదవండి :

నేడు మహారాష్ట్రలో కీలక పరిణామాలు...

నిత్యానంద ఆచూకీ లభ్యం... ఆ దేశంలో...త్వరలో కొత్త బార్లు... ఇవీ రూల్స్

Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు

Published by: Krishna Kumar N
First published: November 23, 2019, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading