Home /News /andhra-pradesh /

HIGH POWER COMMITTEE FOUND PESTICIDES EFFECT IS THE REASON FOR MYSTERY DISEASE IN ELURU ANDHRA PRADESH PRN

Eluru Myster Disease: ఏలూరు వింత వ్యాధికి కారణం అదే..! హైపవర్ కమిటీ నివేదికలో షాకింగ్ నిజాలు..!

ఏలూరులో  వింత వ్యాధిపై నివేదిక  సిద్ధం

ఏలూరులో వింత వ్యాధిపై నివేదిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పశ్చిమగోదావరి జిల్లా (West Godawari) ఏలూరులో కలకలం రేపిన వింత వ్యాధి (Eluru Mystery Disease) మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ వాస్తవాలను నిగ్గుతేల్చింది.

    ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపిన వింత వ్యాధి మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన ఈ ఘటనకు కూరగాయలే కారణమని హైపవర్ కమిటీ తేల్చింది. గతేడాది డిసెంబరు 4 నుంచి 12వ తేదీల మధ్య వారం రోజుల పాటు 622 మంది బాధితులు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరారు. స్థానికంగా సేకరించిన నీరు, ఇతర ఆహార పదార్ధాల్లో హానికరక రసాయనాలున్నా.. కూరగాయల్లోని పురుగు మందుల అవశేషాల కారణంగానే అలా జరిగిందని స్పష్టం చేసింది. ఏలూరు చోటు చేసుకున్న వింత వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు బాధితుల బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తో పాటు స్థానికంగా సరఫరా అయ్యే తాగునీరు, పాలు, ఆహార పదార్థాలు, బియ్యం, కూరగాయలను నిపుణులు పరీక్షించారు.

    కూరగాయల్లో ప్రమాదకర రసాయనాలు
    ముఖ్యంగా ఇన్ ఫెక్షన్లు, శరీరంలోని జీవక్రియలు, నీటిలో భారలోహాలు, పురుగుమందులు ఇలా నాలుగు కోణాల్లో నిపుణుల బృందం పరీక్షలు జరిపింది. ఐతే బాధితుల్లో లక్షణాలకు ఇన్ ఫెక్షన్లు, జీవక్రియల్లో తేడాలు కాదని ప్రాధమికంగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత భార లోహాలు, పురుగు మందులపై దృష్టి పెట్టారు. నీటిలో భారలోహాలు ఎక్కువగా ఉంటే బాధితులు త్వరగా కోలుకునేవారు కాదు. కాబట్టి పరుగులు మందులు, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను విశ్లేషించారు. పురుగుమందుల్లో ఉండే ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లలో ఏదో ఒకదానివల్ల సమస్య వచ్చి ఉండొచ్చని కమిటీ భావించింది. రోగుల బ్లడ్ శాంపిల్స్, అక్కడి వాటర్ శాంపిల్స్ లో ఆర్గానో ఫాస్ఫేట్ అవశేషాలు కనిపించాయి. ఐతే దీనివల్లే అస్వస్థతకు గురయ్యారని భావించినా విరేచనాలు, దగ్గు, ఆయాసం, చూపు మందగించడం వంటి లక్షణాలు లేకపోవడంతో దీనికి ఆర్గొనోఫాస్ఫేట్ కారణం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

    శాంపిల్స్ లో దొరకని అసలైన కెమికల్
    అలాగే ఏలూరులోని వింత వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లోసెకరించిన కూరగాయల్లో మెట్రిబుజిన్ అనే కెమికల్ అవశేషాలున్నాయని.. అదే ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడ రైతులు మెట్రిబుజిన్ ను చాలా తక్కువ స్థాయిలో వినియోగిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. అలాగే ఆర్గానో క్లొరైడ్ వాడకం కూడా చాలావరకు లేదని స్పష్టం చేస్తున్నారు. ఐతే ఆర్గానో క్లోరైడ్ శరీరంలోకి వస్తే 24గంటల తర్వాత దాని అనవాళ్లు కనిపించవు. అందుకే బాధితుల బ్లడ్ శాంపిల్స్ లో లేకపోయినా.. అదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పైగా అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది రెండు మూడు రోజులుగా మాంసాహారం తినలేదు. కాబట్టి కూరగాయల్లోని రసాయనాల అవశేషాలే కారణంగా తేల్చారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత నివేదికను రూపొందించిన హైపవర్ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది.

    మరోవైపు రైతులు పంటల సాగులో రసాయనాల వాడకం తగ్గించాలని, ఏలూరు కాలువలో రసాయనాలు, ఇతర వ్యర్థాలను విడుదల చేయొద్దని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. వింత వ్యాధి ప్రభావానికి గురైన ప్రాంతాలతో పాటు ఏలూరు నగర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసే నీటిపై దృష్టి పెట్టాలని కూడా నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Eluru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు