Home /News /andhra-pradesh /

HIGH PETROL AND DIESEL PRICES IN AP ARE BENEFITING THE PETROL BUNKS IN TELANGANA NS

Petrol-diesel Price: ఏపీ-తెలంగాణ బార్డర్లో భలే వ్యాపారం..

నాగార్జున సాగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

నాగార్జున సాగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

Petrol-diesel Price: ఏపీలో తెలంగాణ కంటే పెట్రోల్ ధర రూ. 3, డీజిల్ ధర రూ. 2.70 ఎక్కువగా ఉండడాన్ని ఇక్కడి వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వారు ప్రత్యేక బోర్డులు పెట్టి మరీ అక్కడి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల క్రితం వరకూ కలిసి ఓకే రాష్ట్రంగా ఉన్నాయి. ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ప్రజలకు, రాజకీయ నాయకులకు, ఇలా అనేక వర్గాల వారికి సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఏదైనా రంగంలో పని చేసే సిబ్బందికి వేతనాలు పెంచినా.. ఇక్కడి వారు కూడా పెంచమని డిమాండ్ చేస్తారు. విద్యుత్, బస్సు ఛార్జీలు, ఏదైనా ధరలు పెంచినా మరో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు అక్కడ లేనిది.. ఇక్కడ ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఒక రాష్ట్రంలో ఏదైనా కొత్త పథకాలు ప్రారంభించినా.. మరో రాష్ట్రంలోనూ ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తాయి. ఒక రాష్ట్రంలో జరిగే పరిణామాలు, మరో రాష్ట్రంపై ఇంతగా ప్రభావం చూపుతాయి. అక్కడ జరిగే రాజకీయ పరిణామాలను ఇక్కడి వారు.. ఇక్కడ మారుతున్న పరిణామాలను అక్కడి వారు అంతే ఆసక్తిగా గమనిస్తారు.

    ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం ధరలు, పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం తెలంగాణకు కలిసి వస్తోంది. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి అక్కడికి మద్యం భారీగా తరలుతోంది. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా మద్యం తరలింపు మాత్రం ఏదో తీరుగా సాగుతూనే ఉంది. ఒంటికి ప్లాస్టర్లు చుట్టుకుని, బియ్యం బస్తాల్లో, పాల క్యాన్లలో ఇలా చిత్ర విచిత్ర రూపాల్లో మద్యం సీసాలను తరలిస్తూ దొరికిన వారు అనేక మంది ఉన్నారు. తెలంగాణలో మద్యం షాపులు బంద్ ఉంటే సరిహద్దు ప్రాంతాల్లోని వారు నడుచుకుంటూ మరీ ఏపీలోకి వెళ్లి మరీ తాగిన ఘటనలు అనేకం. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

    మొత్తానికి ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండడం.. ఆ రాష్ట్రానికి సరిహద్దులో పక్కనే ఉన్న తెలంగాణాలోని మద్యం షాపుల వారికి కలిసి వస్తోంది. అక్కడి వారు వచ్చి ఇక్కడ తాగడం, ఇక్కడి నుంచి ఏదో విధంగా అక్కడి తరలించడంతో వారికి వ్యాపారం అధికంగా సాగుతోంది. ఇప్పుడు ఇదే మాదిరిగా తెలంగాణలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులు సైతం లబ్ధి పొందుతున్నారు. ఏపీలో తెలంగాణ కంటే పెట్రోల్ ధర రూ. 3, డీజిల్ ధర రూ. 2.70 ఎక్కువగా ఉండడాన్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు.

    దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వారు ప్రత్యేక బోర్డులు పెట్టి మరీ అక్కడి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. సరిహద్దుకు సమీపంలోని అనేక ఏపీ గ్రామాల వారు ధర తక్కువగా కావడంతో తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మరీ పెట్రోల్, డీజీల్ ను తీసుకెళ్తున్నారు. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వారు లాభ పడుతున్నారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సైతం పెరుగుతుండగా.. ఏపీ కొంత ఆదాయం కోల్పోతోంది. పక్క పక్కనే ఉన్న రాష్ట్రాల్లో ధరల్లో ఇంతగా తేడా ఉండడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Petrol price, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు