Home /News /andhra-pradesh /

HIGH COURTS KEY DIRECTIONS ON THE SALE OF PUBLIC LANDS IN ANDHRA PRADESH

ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. వేలం వాయిదా..

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ-వేలం ప్రక్రియను వచ్చే నెల 11, 12, 13 తేదీలకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ ప్రకంపనలు స‌ృష్టిస్తున్న ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సురేశ్ బాబుతో పాటు మరో మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అందులో భాగంగానే ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ-వేలం టెండర్లు ఖరారు చేయోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ-వేలం ప్రక్రియను వచ్చే నెల 11, 12, 13 తేదీలకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏదీఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం నెగ్గించుకుంటుదా లేదా అన్న వేచిచూడాల్సిందే.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court

    తదుపరి వార్తలు