HIGH COURT SUMATOGA CASE ON VISHAKA GAS LEAKAGE INCIDENT BN
ఆ ఘటనపై ఏపీ హైకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు నోటీసులు
ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకవ్వడంపై హైకోర్టు విచారణ జరిపింది. అధిక జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అసలు ఇటువంటి పరిశ్రమ ఏలా ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీకేజీ కావడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. గ్యాస్ లీకై పలువురు మృతి చెందిన దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకవ్వడంపై హైకోర్టు విచారణ జరిపింది. అధిక జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అసలు ఇటువంటి పరిశ్రమ ఏలా ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. అర్ధరాత్రి సమయంలో గాల్లోకి గ్యాస్ వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. ఆ వాయువును పీల్చుకోవడంతో శ్వాస ఇబ్బంది మొదలు.. ఊపిరి సలపకుండా తయారయ్యింది. దాదాపు చుట్టూ ఉన్న ఐదు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ గ్యాస్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.