HIGH COURT GIVES GREEN SIGNAL TO ONLINE MOVIE TICKETS SALES BY THE GOVERNMENT IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
AP Online Movie Tickets: ఏపీ ప్రభుత్వానికి ఊరట.., సర్కారీ సినిమా టికెట్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వమే ఆన్ లైన్లో సినిమా టికెట్లు (Online Movie Ticktes) విక్రయించే విధానంపై సస్పెన్స్ వీడింది. సర్కారీ సినిమా టికెట్ల విధానానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వమే ఆన్ లైన్లో సినిమా టికెట్లు (Online Movie Tickets) విక్రయించే విధానంపై సస్పెన్స్ వీడింది. సర్కారీ సినిమా టికెట్ల విధానానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సొంత వేదికలపై టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేమని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తెచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్నాళ్లు వేచి చూద్దామని కోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసిన ధర్మాసనం.., ఈ అంశంలో మల్టిప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని చెప్పింది. తదువరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో జీవో నెంబర్ 142 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోర్టుకెక్కింది.
ఇదిలా ఉంటే ఏపీలో ప్రభుత్వంపై సినిమా టికెట్లను విక్రయించే అంశం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని పలువురు వ్యతిరేకించగా.. పలువురు సపోర్ట్ చేశారు. ప్రభుత్వం సినిమా టికెట్లను తామే విక్రయిస్తామనడమే కాకుండా.. టికెట్ ధరలను తగ్గించింది. దీంతో టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో సినిమా బడ్జెట్, ఏపీలో షూటింగ్ జరుపుకున్నదానిని బట్టి టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఐతే ఆన్ లైన్ టికెట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. దీనిపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోర్టుకెక్కాయి.
తొలుత ప్రభుత్వ విధానంపై కోర్టు కూడా కొన్ని సందేహలు వ్యక్తం చేసింది. ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తే మోనోపొలి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఐతే ప్రభుత్వం చెప్పిన కారణాలు, వివరణకు సంతృప్తి చెందిన కోర్టు.. కొన్నిరోజులు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆన్ లైన్ టికెట్ల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నుంచి అనుమతి రావడంతో ఇకపై ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా మాత్రమే సినిమా టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ను జస్ట్ టికెట్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.