Big Breaking: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి.. జగన్ సర్కార్ కు మరో షాక్

ప్రతీకాత్మకచిత్రం

Vinayaka Chavithi: జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. గణేష్ ఉత్సవాలు నిర్వహించడానికి వీళ్లేదని ఏపీ ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ హైకోర్టు వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని కండిషన్లు పెట్టింది..

  • Share this:
    Vinayaka Chavithi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వివాదంగా మారిన వినాయక చవితి (VINAYAKA CHAVITHI)వేడుకలకు అడ్డు తొలిగింది. హిందువులు డిమాండ్.. వారి కోరిక నెరవేరింది. ఏపీలో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఏపీ హైకోర్టు ( AP HIGH COURT)అనుమతులు ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తూనే కొన్ని ఆంక్షలు తప్పని సరి చేసింది హైకోర్టు.. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఒకేసారి ఐదుగురు మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. అలాగే పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. వినాయ చవితి ఉత్సవాలపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది హైకోర్డు.. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉత్సవాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

    అయితే పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. అయితే హింధువుల మనోభావాలు, వారి హక్కులకు అనుగుణంగా ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో నిఫా భయం.. మరో ప్రమాదం తప్పదా? అసలు నిఫా కథేంటి?

    అయితే ఇప్పుడు వినాయకచవితికి ఎక్కువ రోజుల సమయం లేదు. పదో తేదీనే వినయకచవితి.. అంటే ఒక్కరోజే వ్యవధి ఉంది. ఈ లోపు మండపాలు ఏర్పాటు చేయడం.. పోలీసుల నుంచి అనుమతి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయినా కాని హింధూ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, గణేష్ ఉత్సవ కమీటీలు మాత్రం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఎలాగైనా వినాయక చవితి వేడుకలు నిర్వహించి తీరుతామంటున్నారు.

    ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ అయిపోయింది.. ఇక ఎయిర్ పోర్టులపై ఫోకస్.. విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణ..!

    గత కొన్ని రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. హిందూమతంపై కక్షతోనే జగన్ ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం జగన్ తండ్రి వర్దంతి వేడుకలకు.. వైసీపీ నేతలు, కార్యకర్తల సభలు సమావేశాలకు అడ్డురాని.. కరోనా వినాయక చవితి వేడుకలకు అడ్డు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలే కాదు.. అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్, బీజేపీ నేతలు అంతా సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే ఇప్పుడు వారందరికీ ఏపీ హైకోర్టు తీర్పు ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ తీర్పు మాత్రం ప్రభుత్వానికి షాకే అని చెప్పాలి. మరి కోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి.. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
    Published by:Nagesh Paina
    First published: