అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే కే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ సందర్భంగా వీరన్న దాఖలు చేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ అప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసిన తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై కర్ణాటకలో ఉన్న కేసు గురించి ప్రస్తావించలేదని, అలాగే, ఆయన భార్య ఉద్యోగం గురించి నామినేషన్ పత్రాల్లో చెప్పలేదని కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఆయన తర్వాత రెండో స్థానంలో వచ్చిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఈరన్న, వైసీపీ తరఫున ఎం.తిప్పేస్వామి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థికి 76,741 ఓట్లు వచ్చాయి. తిప్పేస్వామికి 62,029 ఓట్లు వచ్చాయి. ఈరన్న గెలుపొందారు. తిప్పేస్వామి రెండో స్థానంలో నిలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, TDP