సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట...

నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.

news18-telugu
Updated: January 21, 2020, 7:38 PM IST
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట...
ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • Share this:
నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇడిమేపల్లి భూముల విషయంలో ఆయనపై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద సోమిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సదరు భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను సోమిరెడ్డి మీడియా ముఖంగా ప్రదర్శించారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. అప్పట్లో సోమిరెడ్డిని వెంకటాచలం పీఎస్ లో నాలుగున్నర గంటలపాటు విచారించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 21, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading