తమిళనాడులో ఉగ్రవాదులు... తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్...

తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

news18-telugu
Updated: August 23, 2019, 10:18 PM IST
తమిళనాడులో ఉగ్రవాదులు... తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 23, 2019, 10:18 PM IST
తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం శ్రీ కాళహస్తి నుంచి తిరుమల వరకు, జిల్లా సరిహద్దుల వద్ద విస్త్రత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవే ల్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో ఈ రోజు మధ్యాహ్నం నుంచి నిరంతర తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే జిల్లా మొత్తం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దేనినైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని అర్బన్ జిల్లా యస్.పి కె.కె.యన్.అన్బురాజన్ ఆదేశాలు ఇచ్చారు.

జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే జిల్లా ప్రజలు డయల్ 100, వాట్సాప్ (8099999977), కు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలి.

జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల నిఘా పటిష్ట చేయడం జరిగింది.
శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు.


తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి టెంపుల్ ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు.
అనుమానించిన-అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.
Loading...
జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామన్నారు.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...