కర్నూలులో ఓటర్ లిస్టులో వెంకటేష్... పేరు రాణి, వయసు 20, స్త్రీ లింగం...

కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉంది.

news18-telugu
Updated: February 10, 2020, 3:15 PM IST
కర్నూలులో ఓటర్ లిస్టులో వెంకటేష్... పేరు రాణి, వయసు 20, స్త్రీ లింగం...
కర్నూలులో ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫొటో (Image Credit: Eenadu)
  • Share this:
ఎలక్షన్ కమిషన్‌ రిలీజ్ చేసి ఓటర్ జాబితాల్లో కొన్ని కొన్ని సార్లు భయంకరమైన తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉంది. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరొలూ అని ఉంది. తండ్రి / భర్త పేరు బాలు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54a. వయసు 20 సంవత్సరాలు. లింగము : స్త్రీ అని రాసి ఉంది. అయితే, పక్కన ఫొటో మాత్రం వెంకటేష్ ఫొటో ఉంది. ఓటర్ కార్డు నెంబర్ ZGF3524139.హీరో వెంకటేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటాడు. తెలంగాణలో ఓటర్. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటర్ లిస్టులో ఫొటోలు అప్‌లోడ్ చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును హైదరాబాద్‌లో వినియోగించుకున్న వెంకటేష్


ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు... ఇటీవల తెలంగాణలో కూడా ఇలాంటి ఓ విచిత్ర ఫొటో వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో ఇటీవల మూడు సంవత్సరాల చిన్నారి ఫొటో ఓటర్ లిస్టులో వచ్చింది. నందిత అనే బాలిక ఫొటోను ముద్రించి, వయసు మాత్రం 35 సంవత్సరాలు అని రాశారు. పేరు, ఫొటో కరెక్టుగానే రాశారు. కానీ, వయసు మాత్రం 35 అని రాశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వారికే ఓటర్ కార్డులు వస్తాయి. కానీ, అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading