హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ గెలుపు హీరో సూర్యకు పండగేనట...యాత్ర 2లో హీరో సూర్యనేనా ?

జగన్ గెలుపు హీరో సూర్యకు పండగేనట...యాత్ర 2లో హీరో సూర్యనేనా ?

హీరో సూర్య (ఫైల్ చిత్రం)

హీరో సూర్య (ఫైల్ చిత్రం)

వైఎస్ జగన్ ను తాను జగనన్న అని ఆప్యాయంగా పిలుస్తానని అన్నారు. అలాగే వైఎస్. జగన్ కజిన్స్ అయిన అనిల్ రెడ్డి, సునీల్ తనకు కాలేజీలో ఫ్రెండ్స్ అని, అలా తనకు జగన్ తో స్నేహం ఏర్పడిందని అన్నారు. కాలేజీ రోజుల్లో చెన్నైలో తరచూ కలుస్తుండేవారమని, జగన్ కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమని సూర్య అన్నారు.

ఇంకా చదవండి ...

    తన విలక్షణ నటనతోనూ, ప్రయోగాత్మక చిత్రాలతోనూ సౌతిండియాలో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సూర్య, సినిమాలు మాత్రమే కాదు సామాజిక అంశాల్లోనూ నిత్యం చురుగ్గా ఉండే సూర్య తాజాగా ఎన్జీకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా సూర్య ఎన్జీకే చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో పర్యటించారు. ముఖ్యంగా ఎన్జీకే సినిమా బయోపిక్ కాదని, సమాజంలో నిత్యం ప్రజలు చూసే సామాజిక అంశాలనే తెరపై చూపించామని ఆయన అన్నారు. అయితే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంపై సూర్య స్పందించారు. తన స్నేహితుడైన జగన్ గెలుపు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. అంతేకాదు జగన్ గడిచిన పదేళ్లుగా పడిన కష్టానికి ఇది ప్రతిఫలమని అన్నారు. జగన్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. అలాగే సీఎంగా జగన్ ముందు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.


    ఇదిలా ఉంటే తమిళనటుడు సూర్య తనకు వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ను తాను జగనన్న అని ఆప్యాయంగా పిలుస్తానని అన్నారు. అలాగే వైఎస్. జగన్ కజిన్స్ అయిన అనిల్ రెడ్డి, సునీల్ తనకు కాలేజీలో ఫ్రెండ్స్ అని, అలా తనకు జగన్ తో స్నేహం ఏర్పడిందని అన్నారు. కాలేజీ రోజుల్లో చెన్నైలో తరచూ కలుస్తుండేవారమని, జగన్ కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమని సూర్య అన్నారు. జగన్ జీవితంలో పదేళ్ల క్రితం చోటు చేసుకున్న సంఘటనలు తనను బాధించాయని, పట్టుదల, అకుంఠిత దీక్షతో అన్నింటిని అధిగమించి ప్రజల ఆశీర్వాదం ఆయన పొందారని ఈ సందర్భంగా అన్నారు. అలాగే యాత్ర 2 సినిమాలో స్క్రిప్టు నచ్చితే తప్పకుండా నటిస్తానని సూర్య అన్నారు.

    First published:

    Tags: Andhra Pradesh, Jagan, Kollyood News, Suriya, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు