Rajendra Prasad TTD | ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు దర్శనం అనంతరం రాజేంద్ర ప్రసాద్.. తిరుమల శ్రీవారి సన్నిధిలో గత 100 రోజులుగా కొనసాగుతున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నట కిరీటీ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు సుందరకాండ పారాయణంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుందరకాండ పారాయణం నిరాటంకంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికలో 100రోజులు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా 100వ రోజు సుందరకాండ పారాయణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టిన అడిషనల్ ఈఓ ఏవి ధర్మారెడ్డిగారికి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajendra Prasad, Tollywood, Ttd