HERO NANDAMURI BALAKRISHNA VIDEO CALL TO HIS FAN WHO SUFFERD FOR FEVER SOME DAYS HE READY TO SUPPORT NGS GNT
Hero Balayya: పెద్దమనసు చాటుకున్న బాలయ్య.. అనారోగ్యం బారిన పడిన అభిమానికి వీడియో కాల్? ఏం మాట్లాడారో చూడండి.?
బాలకృష్ణ పెద్దమనసు (File/Photo)
Hero Balayya: బాలయ్య అంటే ఆవేశం ఇది అందరికీ తెలిసిందే..? కానీ బాలయ్య ప్రేమ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అని ఆయన్ను అభిమానించే వారు ఎవరైనా చెబుతారు.. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు బాలయ్య.. తన అభిమానికి ఆరోగ్యం బాగు పడడంతో సహకరించారు.
Hero Balayya: హిందూపురం ఎమ్మెల్యే(Hindupram MLA) .. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూటే సపరేటు.. ఎంత ఆవేశం ఉంటుందో అంతే మంచితనం ఉంటుంది. ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట ఇది. సాధారణంగా సోషల్ మీడియా (Social Media) లో అభిమాని చెంప చెళ్లుమనింపించిన బాలయ్య అంటూ తరచూ వార్తలు వింటూంటాం.. అయినా అభిమానులు బాలయ్య చెయ్యి వేసినా హ్యాపీగానే ఫీలవుతారు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ అలా ఉంటుంది. అందుకే బాలయ్యను తమ గుండెల్లో పెట్టుకుని పూజ చేస్తారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్. బాలయ్య అభిమానులను చాలా ప్రేమగా చూసుకుంటారు. అందుకు తాజా ఘటన మరో నిదర్శనం. అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి.. ధైర్యంచెప్పారు.. ఆయన సమస్య నుంచి బయటపడేలా చేశారు. ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. బాలయ్య పెద్ద మనసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఆదోని (Adhoni) లోని మరాఠిగేరిలో ఉండే కాశి విశ్వనాథ్ (Kasi Viswanath) గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం భారిన పడ్డారు. అయన చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకు విరాభిమాని.. ఆయన విష్ ఏంటంటే..? ఒక్కసారైనా బాలయ్య బాబుతో కలవాలని కోరిక ఉండేది, కానీ ఆ లోపే అయన తీవ్ర అనారోగ్య బారిన పడడంతో, తీవ్ర నిరాశతో బాధపడుతూ ఉండేవారు. ముఖ్యంగా బాలయ్యను కలవలేకపోయాను.. మాట్లాడలేకపోయాను అనే బాధ ఆయనలో ఎక్కువైంది. తీవ్ర మనస్థాపంతో ఆయన ఆరోగ్యం మరింత పాడైంది. దీంతో ఆయన ఆరోగ్యం విషయం బాలయ్యకు తెలియాలని.. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు సంప్రదించి,విషయం చెప్పారు..
దీంతో ఆయన ఆ విషయాన్నీ బాలయ్యకు చెప్పారు. వీరాభిమాని బాధ గురించి తెలిసిన వెంటనే కాస్త చలించిన బాలయ్య..ఆలస్యం చేయకుండా..? వెంటనే స్పందించి వీడియో కాల్ (video call) ద్వారా కాశి విశ్వనాథ్ తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు.. తాను అండగా ఉంటానని, ఏమైనా అవసరం అయితే అభిమానుల ద్వారా తనకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత వాళ్ళ కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు. ఫోన్ ద్వారా బాలయ్య బాబు తో మాట్లాడించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే తొలిసారి కాదు గతంలో చాలాసార్లు పెద్ద మనసు చాటుకున్నారు. హిందూపురంలో కొద్ది రోజుల కిందట చెట్టు మీద నుంచి కిందకు పడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన తన అభిమానికి నేరుగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన ఫోన్ చేసిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.