నర్సులను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలపై సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పందించారు. తాను నర్సులను కించపరిచారని కొందరు అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానని అన్నారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని చెప్పారు. రోగులకు(Patients) సేవలందించే తన సోదరీమణులంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. తన మాటలు ఏమైనా వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపడుతున్నానని వెల్లడించారు. ఈ అంశంపై అన్‌స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ నోరు జారారు. తనకు వైద్యం చేసిన నర్సును ఉద్దేశించి ఆ నర్సు... అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు వివాదాస్పదం అయ్యాయి.
గతంలో తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం గురించి బాలకృష్ణ ఆ షోలో వివరించారు. బైక్ యాక్సిడెంట్‌లో తనకు దెబ్బలు తగిలాయని.. కానీ కాలు జారిపడడంతో తగిలాయని అబద్ధం చెప్పి వైద్యం చేయించుకోవాలనుకున్నానని అన్్నారు. హాస్పిటల్‌కి వెళ్లాక ఓ నర్సు తనకు వచ్చిందని.. ఆమెను చూసి నర్సు.. భలే అందంగా ఉందిలే అని అన్నారు. ఆమె అడగ్గానే నిజం చెప్పేశానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. తన మాటలు ఏమైనా వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపడుతున్నానని చెప్పి వివాదానికి ముగింపు పలికారు.
అయితే బాలకృష్ణ ఈ రకంగా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. కొద్దిరోజుల క్రితం తన సినిమా వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సక్సెస్ మీట్‌లో మాట్లాడిన బాలకృష్ణ.. ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అంటూ నోరు జారారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. బాలకృష్ణపై అక్కినేని వారసులు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేశారు.
Balakrishna: మరో వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బాలకృష్ణ.. అక్కినేని తనకు బాబాయ్ లాంటి వారని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలపై అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. తన సొంత పిల్లల కంటే తనతోనే అక్కినేని నాగేశ్వరరావు ఎంతో అప్యాయంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. ఈ రకమైన కామెంట్స్‌తో తన వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nandamuri balakrishna