Home /News /andhra-pradesh /

AP Welfare Schemes: మరో పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు... ఇలా అప్లై చేస్తే రూ.24వేలు మీవే...

AP Welfare Schemes: మరో పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు... ఇలా అప్లై చేస్తే రూ.24వేలు మీవే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) అని వర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాల (AP Welfare Schemes) ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది. అర్హులకు నేరుగా వారి ఎకౌంట్లలోనే నగదు జమ చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర వంటి పథకాలను లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించనుంది. ఈ ఆర్ధిక సాయాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. నేతన్న నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

    గడువులోగా ఎంపిక ప్రక్రియ పూర్తికావాలని ఆధేశాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామ, వారడు సచివాలయాల్లో గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఉండటంతో దీనిని మరోసారి పరిశీలించనున్నారు. దీనికి కొత్తగా అర్హులైన వారి పేర్లను జత చేసి ఈనెల 26న (శనివారం) గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. జూలై 5వ తేదీ వరకు పరిశీలన అనంతరం.. జూలై 6 నుంచి వ తేదీ లోపు కొత్తగా అర్హులైన నేతన్నల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 9,10వ తేదీల్లో అర్హుల జాబితాను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు పంపిస్తారు.

    ఇది చదవండి: ఒక్క మహిళ కోసం ఇద్దరి మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందంటే..


    నాలుగు రోజుల పాటు జాబితా పరిశీలన అనంతరం జూన్ 15న జాబితాను జిల్లా స్థాయిలో హ్యండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్లకు పంపిస్తారు. జూన్ 19నాటికి కార్పొరేషన్ల వారిగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసి జూన్ 20-22వ తేదీ మధ్య జిల్లా స్థాయిలో అర్హుల జాబితాను ఖరారు చేస్తారు. జూలై 23న తుదిజాబితాను హ్యాండ్ లూమ్స్ టెక్స్ టైల్స్ డైరెక్టర్ కు అందజేస్తారు. ఆతర్వాత లబ్ధిదారులకు అందించాల్సిన నిధుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.

    ఇది చదవండి: ఏపీలో డెల్టాప్లస్ వేరియంట్ పై క్లారిటీ.. తొలి కేసు ఎక్కడంటే..!


    వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు మాత్రమే ఆర్ధిక సాయం అందిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉంటేనే సాయం అందుతుంది.  అర్హులైన చేనేత కుటుంబాలు ఆధార్, బ్యాంక్ ఎకౌంట్, కుటుంబ వివరాలతో పాటు చేనేత వృత్తిలో ఉన్నట్లు ధృవీకరణ పత్రాలను వాలంటీర్లు లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ap welfare schemes, Ysr nethanna nestham

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు