Home /News /andhra-pradesh /

HERE IS THE COMPLETE STORY BEHING 1998 DSC ISSUE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

1998 Dsc Issue: 1998 డీఎస్సీ వివాదానికి కారణాలేంటి..? ఆ రెండు జీవోలు ఎందుకిచ్చారు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 1998 డీఎస్సీ ( Dsc-1998) గురించే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన పాతికేళ్ల తర్వాత వారికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు రావడం, ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 1998 డీఎస్సీ ఇష్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 1998 డీఎస్సీ ( Dsc-1998) గురించే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన పాతికేళ్ల తర్వాత వారికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు రావడం, ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 1998 డీఎస్సీ ఇష్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అప్పుడు క్వాలిఫై అయిన వారు దాదాపు రిటైర్మెంట్ కు దగ్గరపడ్డారు. వాళ్లిప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో ఆ బ్యాచ్ అందరిపైనా చర్చ మొదలైంది. అసలు 1998 డీఎస్సీ వివాదం ఎక్కడ మొదలైంది.. పాతికేళ్ల పాటు ఎలా సాగింది సుదీర్ఘంగా సాగిన పోరాటానికి మూలం ఏంటనేదానిపై ప్రతిఒక్కరూ దృష్టిపెడుతున్నారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది.

    ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి రిజర్వేషన్లు కూడా కేటాయంచింది. అందులో ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌ గా నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 జారీ చేసింది.

    ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.. ఆయన స్టోరీ వింటే కన్నీళ్లు రాకమానవు..!


    అయితే అదే సమయంలో ఏపీలో ఉపఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను వాయిదా వేశారు. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచారు. ఐతే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయడంతో గందరగోళం మొదలైంది. మొదట ఇచ్చిన జీవో ప్రకారం కటాఫ్ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారు. ఐతే ఆ తర్వాత జీవో ప్రకారం అర్హత సాధించిన వారికి కూడా ఉద్యోగం ఇవ్వాలి.

    ఇది చదవండి: ప్లీనరీలో జగన్ చేసే ప్రకటన ఇదేనా..? ఆ నేతలకు షాక్ తప్పదా..? వైసీపీలో జోరుగా చర్చ..


    ఐతే ఆయా ఇంటర్వ్యూలకు రెండు జీవోల ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులుహాజరవగా.. మొదట ఇచ్చిన 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు సాధించిన వారు ఉద్యోగానికి అర్హత సాధించలేదు. దీంతో ఆ అభ్యర్థులంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. దాదాపు 11ఏళ్ల పాటు విచారణ జరిగన ట్రైబ్యునల్ నష్టపోయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలివ్వాలని ఆదేశించింది.



    2011లో హైకోర్టులో విచారణ జరపగా.. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. హైకోర్టు తీర్పునిచ్చినా అమలు కాకపోవడంతో అభ్యర్థులంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వారికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం జగన్ కూడా ఆ ఫైలుపై సంతకం చేయడంతో వారికి పోస్టింగ్ రానుంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి వారికి టీచర్లుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు