అగ్రవర్ణపేదలకు ఆర్ధికసాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఈబీసీ నేస్తం పథకాన్ని (EBC Nestham Scheme) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య ఇలా అగ్రవర్ణాలకు చెందిన పేదలకు వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha), కాపునేస్తం (Kapu Nestham Scheme) పథకాల మాదిరిగానే ఆర్ధిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అర్హుల వివరాలను అంచనా వేసిన ప్రభుత్వం నిధుల లభ్యతపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో లబ్ధిదారుల అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం, ప్రభుత్వానికి సమర్పించాల్సిన పత్రాల వివరాలను విడుదల చేసింది. గ్రామ వాలంటీర్, సచివాలయ స్థాయిలో దరఖాస్తులు చేయాలని సూచించింది.
1. పథకం పేరు : ఈబీసీ నేస్తం
2. ముఖ్య ఉద్దేశం : GO విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ [EBC] మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం కోసం ఆర్థిక సాయం అందించటం.
3. ఆర్థిక సాయం : సంవత్సరానికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు.
4. 2021-22 బడ్జెట్ : సంవత్సరానికి 670-605 కోట్లు అలా మూడు సంవత్సరాలు కు 1810-2011 కోట్లు.
5. అర్హతలు :
డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ లు :
1. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ( డేట్ అఫ్ బర్త్ ఉంటేనే )
2. బర్త్ సర్టిఫికెట్ / 10వ తరగతి సర్టిఫికెట్
3.ఆధార్ కార్డు
6. అర్హుల ఎంపిక, ఆమోదం మరియు శాంక్షన్ ప్రాసెస్ :
i. సచివాలయ లో ఉన్నటువంటి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే అనేది చేసి అర్హులను ఎంపిక చేస్తారు.
ii. ఎంపిక చేసేటప్పుడు అవసరం అయ్యే విషయాలు:
పేరు
ఆధార్ నంబర్
ఫోన్ నంబర్
కుటుంబ పెద్ద పేరు
కుటుంబ పెద్ద ఆధార్ కార్డు నంబర్
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
జనన ధ్రువీకరణ సర్టిఫికెట్
కుటుంబ మొత్తం ఆదాయం
బ్యాంకు అకౌంట్ పాసుబుక్ కాపీ
అకౌంట్ నెంబర్ / IFSC కోడ్ /బ్రాంచ్ పేరు
4 వీలర్ ఉంటే వెహికల్ నెంబర్
భూమి వివరాలు (పళ్ళము / మెట్ట )
మున్సిపాలిటీ ప్రాపర్టీ వివరాలు
గవర్నమెంట్ ఎంప్లొయ్/ పెన్సనర్ స్టేటస్
iii. గ్రామ వార్డు వాలంటీర్లు సర్వే చేసే ముందు అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
iv. వాలంటీర్లు సర్వే చేసిన తరువాత సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వాలిడేషన్ చేస్తారు. తరువాత సంబంధిత ఎంపీడీవో / మునిసిపల్ కమిషనర్ ప్రూఫ్ లను పరిశీలించి అప్లికేషన్లను స్క్రూటినీ చేసి BC కార్పొరేషన్ యొక్క ED వారికి ఫార్వర్డ్ చేస్తారు, వారు జిల్లా కలెక్టర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు, అక్కడ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ లిస్ట్ ను AP STATE Welfare and Development Corporation ఫైనల్ శాంక్షన్ చేసి అమౌంట్ బడ్జెట్ అనుగుణం గా వేస్తారు.
7. వెబ్ సైట్ : దీని పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి నవశకం లాగిన్ లో అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap welfare schemes