Home /News /andhra-pradesh /

HERE ARE THE SENSATIONAL FACTS BEHIND YCP MLC ANANTABABU DRIVER DEATH CASE PRN

Kakinada: కాకినాడలో కొనసాగుతున్న డెత్ మిస్టరీ.. అజ్ఞాతంలో ఎమ్మెల్సీ.. యాక్సిడెంట్ జరగలేదన్న పోలీసులు..

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాకినాడ (Kakinada) లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (YCP MLC Anantababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిస్టరీని తలపిస్తోంది. బర్త్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మృతి కేసులో వేళ్లన్నీ అనంతబాబువైపే చూపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాకినాడ (Kakinada) లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (YCP MLC Anantababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిస్టరీని తలపిస్తోంది. బర్త్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మృతి కేసులో వేళ్లన్నీ అనంతబాబువైపే చూపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యంది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తొలుత రోడ్డు ప్రమాదం అని చెప్పిన ఎమ్మెల్సీ.. ఆ తర్వాత కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంది శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కాకినాడలోని అతడి ఇంటికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. అదే రోజు సాయంత్రం ఓ పెళ్లిలో కనిపించారు. అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుపై మాత్రం కేసు నమోదు చేయలేదు.

    అనంతబాబు వచ్చి మార్చురీ వద్ద ఉంటే తప్ప పోస్ట్ మార్టంకు ఒప్పుకునేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సంతకం చేయకపోవడంతో పోస్ట్ మార్టం నిలిచిపోయింది. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యంది హత్యేనని.. ఎమ్మెల్సీనే మర్డర్ చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని పుట్టిన రోజు పేరుతో పిలిచి చంపేశారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ఆరోపిస్తోంది.

    ఇది చదవండి: పవన్ స్టైల్.. బాలయ్య డైలాగ్స్.. లోకేష్ లో ఈ మార్పు గమనించారా..?


    ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యం నాగమల్లి తోట వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుండగా.. ఆయన చెప్పిన చోట రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎలాంటి అనవాళ్లు లేవు. యాక్సిడెంట్ కు గురైన బైక్ కూడా కనిపించలేదు. పోలీసులు కూడా ప్రమాదం జరగలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: మా సంగతేంటి సారు..? వలస ఎమ్మెల్యేలకి సెగలు..? పొలిటికల్ ఫ్యూచర్ పై టెన్షన్ టెన్షన్..


    ఎమ్మెల్సీ చెబుతున్న విషయాలపై కుటుంబ సభ్యులు పలు ప్రశ్నలు లెవనెత్తుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే శరీరంపై నీళ్లు, సముద్రపు ఇసుక ఎందుకుంటుంది,పెదాలపై గాయాలు, కవుకు దెబ్బలు, చేతులు ఎలా విరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగితే ఆస్పత్రికి తీసుకెళ్లి, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా మృతదేహాన్ని ఎందుకు తీసుకొచ్చారు..? ఒకవేళ ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడి డాక్టర్లు పోలీసులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించాలి.. అలా కాకుండా ఎలా వదిలేశారు..? అని ప్రశ్నిస్తున్నారు.

    ఇది చదవండి: పీఏగా పెట్టుకుంటే అందరి నోళ్లూ మూయిస్తా.. సీఎంను కోరిన విద్యార్థి.. జగన్ ఏమన్నారంటే..!


    మరోవైపు జరిగిన విషయాన్ని మీడియా సమావేశంలో వివరిస్తానన్న అనంతబాబు ఉన్నట్లుండి అదృశ్యమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ప్రస్తతం అనంత బాబు విజయవాడలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం పూర్తయితేగానీ కేసు ముందుకు కదలదని చెబుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు