Anna Raghu, Guntur, News18
పూర్వ కాలంలో రాజుల పరిపాలన, బ్రిటిష్ పరిపాలన తరువాత స్వతంత్ర అనంతరం ప్రజలను చైతన్య పరచటానికి సామజిక నాటకాలను ప్రదర్శించి వారిలో చైత్యన్యాన్ని నింపుతారు అలాగే స్వతంత్ర సమయంలో స్వతంత్ర స్ఫూర్తి నింపటానికి నాటకాలు ఎంతో ఉపయోగపడ్డవి అంతం లో సందేహం లేదు. అలా సామజిక స్పృహ పెంపొందించటానికి వచ్చినదే చింతామణి నాటకం (Chintamani Natakam). పూర్వం స్త్రీ వ్యామోహంతో మనిషి కుటుంబ ఆర్ధిక సామాజికంగా ఏవిధంగా దెబ్బతింటాడో తెలిపేందుకు చింతామణి నాటకాన్ని 20శతాబ్దం ఆరంభంలో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దంపడుతూ పద్యనాటకం రూపుదిద్దుకుంది. పురుషులు వేశ్యల మోజులో పడి కుటుంబాలను నాశనం చేస్తుండటంతో వారి భార్యాబిడ్డలు రోడ్డున పడే పరిస్థితులుండేవి. అంతేకాకుండా అప్పటి ఆచారాలు, వ్యవహారాలు కఠినంగా ఉండేది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవగాహన కలిగించేందుకు చింతామణి నాటకాన్ని రచించారు.
తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. తెలుగు నాటక రంగంలో చింతామణికి ప్రత్యేక స్థానం ఉంది.. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి ప్రధాన పాత్రధారులు. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర.. చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో ఆస్తినంతా పొగొట్టుకుంటుంది సుబ్బిశెట్టి పాత్ర. ఐతే కాలానుగుణంగా వర్ధమాన నాటక సంఘాలు చింతామణి నాటకాన్ని రెండు పాత్రలకే పరిమితం చేసి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో నాటక సారాంశాన్ని వక్రమార్గం పట్టించారు. కథలోని పాత్రదారులతో నాటకాన్ని రక్తి కట్టించి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే తలంపుతో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకాన్ని రచించారు.
కానీ ఈ తరం కళాకారులు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి చింతామణి మధ్యలో అసభ్యకర సంభాషణలు చేర్చి చింతామణి నాటకానికున్న ప్రభను తగ్గించి వివాదాల్లోకి లాగారు. గత రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు చింతామణి నాటకానికి చాలా క్రేజ్ ఉండేది. ఐతే కాల క్రమేణా నాటకంలోని సంభాషణలు, పద్యాల్లో మార్పులు వచ్చాయి. హాస్యం కోసం అశ్లీల డైలాగులు చేర్చారు. ప్రజల్లో ఆదరణ కోసం ఒరిజనల్ కంటెంట్ ను మార్చేశారు. కేవలం చింతామణి, సుబ్బిశెట్టి పాత్రల మధ్య డబుల్ మీనింగ్ డైలాగులే ప్రాధాన్యత పెరిగింది. బిల్వమంగళుడి పాత్ర ప్రాముఖ్యత తగ్గింపోయింది. దీంతో ఓ కులానికి చెందిన వారు నాటకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో సుబ్బిశెట్టి పాత్రతో ఆ వర్గం వారు రగిలిపోయే పరిస్థితికి వచ్చింది.
దీంతో నాటకాన్ని నిషేధించాలంటూ కోర్టుకు కూడా వెళ్లారు. గతంలో రోశయ్య సీఎంగా ఉండగా చింతామణి నాటకాన్ని నిషేధించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత నాటకంపై నిషేధం కొనసాగింది. గత ఏడాది రాష్ట్ర ఆర్యవైశ్య మహాశభ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. తాగా రాష్ట్రంలో చింతామణి ప్రదర్శనను నిషేదిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh