HERE ARE THE REASONS FOR AP GOVERNMENT BANNING CHINTAMANI NATAKAM IN THE STATE FULL DETAILS HERE PRN
Chintamani: ‘చింతామణి నాటకం’పై నిషేధం ఎందుకు..? ఆ వర్గం అభ్యంతరాలు ఇవేనా..!
చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం
నాటక ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఒకప్పుడు ఆంధ్రదేశ్ ను (Andhra Pradesh) ఉర్రూతలూగించిన చింతామణి నాటకంపై (Chinthamani Natakam) ప్రభుత్వం (Government of Andhra Pradesh) నిషేధం విధించింది.
నాటక ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ను (Andhra Pradesh) ఉర్రూతలూగించిన చింతామణి నాటకంపై (Chinthamani Natakam) ఏపీ ప్రభుత్వం (Government of Andhra Pradesh) నిషేధం విధించింది. కొంతకాలంగా ఆర్యవైశ్య వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో చింతామణిని బ్యాన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆదేశాలిచ్చింది. తెలుగు నాటక రంగంలో చింతామణికి ప్రత్యేక స్థానం ఉంది.. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి ప్రధాన పాత్రధారులు. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర.. చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో ఆస్తినంతా పొగొట్టుకుంటుంది. అలాంటి పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు. దాదాపు 20ఏళ్లుగా దీనిపై వివాదం రేగుతోంది.
చింతామణి నాటకాన్ని 20శతాబ్దం ఆరంభంలో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకాన్ని రచించారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దంపడుతూ పద్యనాటకం రూపుదిద్దుకుంది. పురుషులు వేశ్యల మోజులో పడి కుటుంబాలను నాశనం చేస్తుండటంతో వారి భార్యాబిడ్డలు రోడ్డున పడే పరిస్థితులుండేవి. అంతేకాకుండా అప్పటి ఆచారాలు, వ్యవహారాలు కఠినంగా ఉండేది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవగాహన కలిగించేందుకు చింతామణి నాటకాన్ని రచించారు. తొలిసారిగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు.
చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో
గత రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు చింతామణి నాటకానికి చాలా క్రేజ్ ఉండేది. ఐతే కాల క్రమేణా నాటకంలోని సంభాషణలు, పద్యాల్లో మార్పులు వచ్చాయి. హాస్యం కోసం అశ్లీల డైలాగులు చేర్చారు. ప్రజల్లో ఆదరణ కోసం ఒరిజనల్ కంటెంట్ ను మార్చేశారు. కేవలం చింతామణి, సుబ్బిశెట్టి పాత్రల మధ్య డబుల్ మీనింగ్ డైలాగులే ప్రాధాన్యత పెరిగింది. బిల్వమంగళుడి పాత్ర ప్రాముఖ్యత తగ్గింపోయింది. దీంతో ఓ కులానికి చెందిన వారు నాటకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో సుబ్బిశెట్టి పాత్రతో ఆ వర్గం వారు రగిలిపోయే పరిస్థితికి వచ్చింది.
దీంతో నాటకాన్ని నిషేధించాలంటూ కోర్టుకు కూడా వెళ్లారు. గతంలో రోశయ్య సీఎంగా ఉండగా చింతామణి నాటకాన్ని నిషేధించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత నాటకంపై నిషేధం కొనసాగింది. గత ఏడాది రాష్ట్ర ఆర్యవైశ్య మహాశభ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. తాగా రాష్ట్రంలో చింతామణి ప్రదర్శనను నిషేదిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.