హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CBN-Lokesh: టీడీపీలో ఏం జరగుతోంది..? చంద్రబాబే లోకేష్ ను పక్కనబెడుతున్నారా..? కారణం ఇదేనా..?

CBN-Lokesh: టీడీపీలో ఏం జరగుతోంది..? చంద్రబాబే లోకేష్ ను పక్కనబెడుతున్నారా..? కారణం ఇదేనా..?

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

TDP: చంద్రబాబు (Nara Chandra Babu Naidu) ఇటీవల అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తుండగా.. టీడీపీ (TDP) భవిష్యత్ సారధిగా ప్రచారంలో ఉన్న లోకేష్ (Nara Lokesh) వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల లోకేష్ కేవలం మంగళగిరికే పరిమితమవుతున్నారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18

  ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)లో జోష్ పెరిగింది. ప్రభుత్వ విధానాలపై తెలుగు తమ్ముళ్లు, ఆ పార్టీ ముఖ్యనేతలు బాగానే పోరాటం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే సందర్భాన్ని బట్టి తన సొంత నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలను కూడా చుట్టేస్తున్నారు. కానీ టీడీపీ భవిష్యత్ సారధిగా ప్రచారంలో ఉన్న లోకేష్ వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల లోకేష్ కేవలం మంగళగిరికే పరిమితమవుతున్నారు. ఓవైపు చంద్రబాబు పర్యటనలు ఆన్లైన్ మీటింగ్ లు నిర్వహిస్తూ బిజీ గా ఉన్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలోనూ చంద్రబాబు జిల్లాలకు వెళ్తున్నారు. ఇటీవల మాచర్లలో టీడీపీ నేత అంత్యక్రియల్లోనూ బాబు పాల్గొన్నారు. ఇలా ప్రతి కార్యక్రమానికి చంద్రబాబే హాజరవుతున్నారు. కానీ లోకేష్ హడావిడి మాత్రం కనిపించడం లేదు.

  ఐతే చినబాబును చంద్రబాబే పక్కనబెడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళగిరిలో పర్యటనలు, సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపై విమర్శలకే లోకేష్ పరిమితమవుతున్నారు తప్ప.. రాష్ట్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. గతంలో లోకేష్ రాష్ట్ర స్థాయి ప్రజాపోరాటాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచి వారికి భరోసానిచ్చేవారు. అలాగే ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యా విషయంలో ధర్నా చేసి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అప్పటివరకు హడావిడి చేసిన లోకేష్ ఒక్కసారిగా మంగళగిరికే పరిమితమవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీలోని స్కూళ్లలో కరోనా పంజా.. భారీగా వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసులు..


  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిరోజూ ఒక క్లార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చూస్తోంది. ఐతే ఈ మొత్తం వ్యూహంలో లోకేష్ మాత్రం నామమాత్రంగానే కనిపిస్తున్నారనేది విశ్లేషకుల మాట.

  ఇది చదవండి: ఏపీలో కరోనా టెస్టుల ధర తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే..!


  అధికార వైసీపీ.. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థి లోకేష్ అని.. ఆయన వల్ల ఏమీ కాదని ప్రచారం చేస్తోంది. మంగళగిరిలో గెలవలేని వాడు సీఎం ఎలా అవుతాడనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. లోకేష్ సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి అంతే అంటూ నెగెటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో లోకేష్ కు వ్యతిరేకంగా పోస్టులు కూడా చేయిస్తోంది. వైసీపీ ప్రచారం సక్సెస్ అయితే మొదటికే మోసం వస్తుందని భావించి లోకేష్ జోరును కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నార చంద్రబాబు.

  ఇది చదవండి: ఆర్అర్ఆర్ మూవీని వీడని కష్టాలు.. సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్.. కారణం ఇదే..!


  ఆంతేకాదు టీడీపీ నేతలు కూడా కొత్త బాష్యం చెబుతున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా వచ్చిన జగన్.. పాలనను భ్రష్టుపట్టించారని.. ఇప్పుడు లోకేష్ పైనా వారసత్వ ముద్రవేస్తే ప్రజలు కూడా అదే రకంగా ఆలోచించే ప్రమాదం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. ముందు పార్టీ గెలిస్తే ఆ తర్వాత సీఎం ఎవరనేదానిపై ఆలోచించుకోవచ్చనేది తెలుగుతమ్ముళ్ల మాట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు