Home /News /andhra-pradesh /

HERE ARE THE PROOFS ABOUT HOW TDP TRYING TO COLLABORATE WITH PAWAN KALYAN JANASENA PARTY IN 2024 ASSEMBLY ELECTIONS ANDHRA PRADESH PRN

TDP-Janasena: జనసేనను టీడీపీ అలా ట్యూన్ చేస్తోందా..? మరి పవన్ రియాక్షన్ ఏంటో..!

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party), జనసేన పార్టీ (Janasena Party) పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కుప్పం పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ కూడా జనసేనతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్పారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party), జనసేన పార్టీ (Janasena Party) పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కుప్పం పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ కూడా జనసేనతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్పారు. దీంతో రెండు పార్టీలు కలవబోతున్నట్లు అంతా చర్చించుకున్నారు. ఐతే పొత్తులపై ఆచుతూచి ముందుకు వెళ్లాలని.. ఇతర పార్టీల ట్రాప్ లో పడొద్దని జనసేనాని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు సూచించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఐతే కొన్ని జిల్లాల్లో నాయకత్వానికి సబంధించి టీటీడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జనసేనకు అనుకూలంగా ఉండటంతో పవన్ తో చేతులు కలిపేందుకు సైకిల్ పార్టీ గట్టిగానే ట్రై చేస్తుందన్నది స్పష్టమవుతోంది.

  వాస్తవానికి జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది. కేడర్ కూడా బలంగానే ఉంది. దానినే తమకు ప్లస్ గా మార్చుకోవాలనేది టీడీపీ స్కెచ్. అందుకే జనసేనను ట్యూన్ చేసేందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో సరైన నాయకత్వాన్ని నియమించకుండా జనసేనకు సహకరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పట్టున్నవారి ప్లేస్ లో అంతగా బలంలోని నాయకులకు ప్రాధాన్యతనిస్తోంది.

  ఇది చదవండి: సీమకు సముద్రం.. కొత్త జిల్లాలతో మారిన స్వరూపం.. రాయలసీమలో బంగాళాఖాతం..!


  2019లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన భీమవరంలో పులవర్తి రామాంజనేయులుకు గట్టి పట్టుంది. ఎన్నికల తర్వాత ఆయనను ఇన్ ఛార్జిగా నియమించాల్సిందిపోయి.. రాజ్యసభ ఎంపీ సీతారామలక్ష్మికి ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చారు. ఆమెకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. దీన్నిబట్టి చూస్తే భీమవరంను టీడీపీ లైట్ తీసుకొని పవన్ కు మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు టికెట్ లేదని ఇప్పటికే బాబు స్పష్టం చేశారు. అంతేకాదు అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ కంటే జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుకుదిరితే ఆ సీటును జనసేనకు వదేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: సీఎం జగన్ చేతికి పీకే రిపోర్ట్..? ఆ అంశాలపై హెచ్చరించారా..? అసలు నిజం ఇదేనా..?


  ఈ రెండు నియోజకవర్గాలో పాటు విజయవాడలో ఓ నియోజకవర్గాన్ని టీడీపీ లైట్ తీసుకుంది. అదే విజయవాడ వెస్ట్. ఇక్కడ జనసేన విజయవాడ అర్బన్ అధ్యక్షుడు పోతిన మహేష్ బరిలో ఉన్నారు. మంత్రి వెల్లంపల్లికి గట్టిపోటీనిచ్చేనేతగా ఆయన ఎదిగారు. దీంతో అక్కడ ఇన్ ఛార్జిని నియమించకుండా సమన్వయపరిచే బాధ్యతను ఎంపీ కేశినేని నానికి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ కూడా జనసేనకు టీడీపీ పరోక్షంగా సహకరిస్తుందనే వాదన బలంగా ఉంది.

  ఇది చదవండి:  నాలుగు జిల్లాలు.. ఎనిమిది మంది ఎంపీలు.. కానీ ఇద్దరే యాక్టివ్.. మిగతా ఎంపీలెక్కడ..!


  అటు విశాఖపట్నం జిల్లా భీమిలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో అక్కడ దివంగత మాజీ ఎంపీ సబ్బం హరి పోటీ చేసి ఓడిపోయారు. జనసేన తరపున పోటీ చేసిన పంచక్ల సందీప్.. మంత్రి అవంతికి పోటీగా ఎదుగుతున్నారు. భీమిలిలోనూ టీడీపీ డమ్మీ ఇన్ ఛార్జిని నియమించిందన్న ప్రచారం ఉంది. దీంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాలను జనసేనకు వదిలేసేందుకు టీడీపీ స్కెచ్ వేసిందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే పొత్తుపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేసేవరకు ఆగాల్సిందే..!
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు