హోమ్ /వార్తలు /andhra-pradesh /

Janasnena: జనసేన టార్గెట్ ఈ స్థానాలేనా.. కష్టపడితే గెలుపు గ్యారెంటీ అంటున్న సైనికులు.. పవన్ వ్యూహమేంటి..?

Janasnena: జనసేన టార్గెట్ ఈ స్థానాలేనా.. కష్టపడితే గెలుపు గ్యారెంటీ అంటున్న సైనికులు.. పవన్ వ్యూహమేంటి..?

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena Party) కి ఒక ప్రత్యేక స్థానముంది. ఎన్నికల్లో గెలవకపోయినా, గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందన్న పేరుంది. 2014, 2019 ఎన్నికల్లో అది స్పష్టమైంది. 2024లో మాత్రం ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పావులు కదుపుతున్నారు.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena Party) కి ఒక ప్రత్యేక స్థానముంది. ఎన్నికల్లో గెలవకపోయినా, గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందన్న పేరుంది. 2014, 2019 ఎన్నికల్లో అది స్పష్టమైంది. 2024లో మాత్రం ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పావులు కదుపుతున్నారు. త్వరలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచే పవన్ 2024 ఎన్నికల శంఖారావం పూరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో వైసీపీ బలంగానే ఉన్నా.. కొన్ని స్థానాలపై దృష్టి పెడితే గెలుపు గ్యారెంటీ అని జనసైనికులు చర్చించుకుంటున్నారు. అక్కడక్కడా వైసీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే కొన్ని అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. టీడీపీతో జతకట్టినా కట్టకపోయినా.. కొన్ని స్థానాల్లో మాత్రం లెక్కలు తారుమారు చేసి తమ ఖాతాలో వేసుకొవాలని జనసేన చూస్తోంది.

    ఈ జాబితాలో విశాఖపట్నం లోక్ సభస్థానం ముందుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఇక్కడ ఆయనకు రెండు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ.. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ పై నాలుగువేల ఓట్ల తేడాతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కాస్త కష్టపడితే విశాఖలో పాగా వేయొచ్చని జనసేన భావిస్తోంది. ఐతే వైజాగ్ సిటీలో టీడీపీ బలంగా ఉంది. కానీ విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఐదు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంక్ బలంగా ఉంది. క్షేత్రస్థాయి నాయకత్వం సమర్ధంగా పనిచేస్తే ఓట్లు దక్కించుకోవచ్చనేది జనసైనికుల భావనగా ఉంది. ఐతే వైజాగ్ సిటీలో టీడీపీ బలంగా ఉన్నందున తమకు కూడా అవకాశముందని భావిస్తోంది. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే విశాఖ వీరి ఖాతాలోనే చేరడం ఖాయమన్నది విశ్లేషకుల మాట.

    ఇది చదవండి: అమరావతిపై మరో వివాదం.. సీఆర్డీఏకి లీగల్ నోటీసులు.. కారణం ఇదే..!

    జనసేన పార్టీ బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సెగ్మెంట్ పై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఇక్కట జనసేన అభ్యర్థికి దాదాపు లక్షన్నర ఓట్లు వచ్చాయి. 2019లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ 25వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంచి అభ్యర్థిని దించి కాస్త కష్టపడితే కాకినాడలో జెండా ఎగురవేయొచ్చనేది జనసేన లెక్కగా ఉంది.

    ఇది చదవండి: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపు..! అధికారుల క్లారిటీ..

    ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక స్థానమైన నరసాపురం నియోజకవర్గం కూడా జనసేనకు కీలకం కానుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేయగా.., ఆయనకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున రఘురామకృష్ణం రాజు 31వేల ఓట్లతో విజయం సాధించారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నరసాపురంపై దృష్టిపెడితే గెలుపు గ్యారెంటీ అని జనసేన లెక్కలేసుకుంటున్నా.. గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోవడం మైనస్ గా మారింది. పైగా 2019లో టీడీపీకి ఇక్కడ మంచి ఓట్లే వచ్చాయి. వైసీపీ, టీడీపీ నుంచి ఎన్ని ఓట్లను జనసేన లాగేసుకుంటుందనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం.

    ఇది చదవండి: 2024లో జగన్ ను ఢీ కొట్టేది ఆయనే.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు..

    ఏపీలో అత్యంత ముఖ్యమైన పార్లమెంట్ స్థానం తిరుపతిపైనా జనసేన దృష్టిపెట్టింది. తిరుపతి పరిధిలోనూ కాపుల ఓట్లు బాగానే ఉన్నాయి. నిజానికి గత ఏడాది జరిగిన ఉపఎన్నికలో జనసేన పోటీ చేయాలని భావించినా.. ఆ సీటును బీజేపీకి అప్పగించాల్సి వచ్చింది. ఇక్కడ సొంత అభ్యర్థిని బరిలో దించి ప్రణాలిక ప్రకారం వర్కవుట్ చేస్తే గెలవొచ్చనేది జనసేన నమ్మకం. వీటితో పాటు విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లోనూ ప్రభావం చూపాలని పవన్ కల్యాణ్ అండ్ కో వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై ఎన్ని లెక్కలు వేసుకున్నా.. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలవని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఐతే జనసేనలోని ఓ వర్గం మాత్రం 2014 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో టీడీపీతో పొత్తు వద్దని సూచిస్తున్నాయి.

    First published:

    ఉత్తమ కథలు